శుక్రవారం 30 అక్టోబర్ 2020
Warangal-city - Jun 19, 2020 , 02:12:05

రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

n రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు భిక్షపతి

n నాగారం, పైడిపల్లిలో సీఎం కేసీఆర్‌   చిత్రపటాలకు క్షీరాభిషేకం

పరకాల : రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమ ని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు బొల్లె భిక్షపతి అన్నా రు. గురువారం మండలంలోని నాగారం, పైడిపల్లి గ్రామా ల్లో రైతులు సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన భిక్షపతి మాట్లాడుతూ రైతు శ్రేయ స్సు కోసం తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదన్నారు. కరోనా కష్టకాలంలో కూడా రైతుబంధు కింద ఎకరాకు రూ.5 వేలు ఇచ్చి రైతులను ఆదుకుంటున్న మహానేత కేసీఆరేనన్నారు. ఏఎంసీ చైర్మన్‌ రమేశ్‌ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన నిర్మించి సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో రెండు పంటలకు బాటలు వేశారన్నారు. గతంలో ఏనాడూ కాల్వల్లో నీరు కనిపించలేదని, ఇప్పుడు ఎప్పుడు చూసి నా నీటితో దర్శనమిస్తున్నాయన్నారు. కార్యక్రమాల్లో జెడ్పీటీసీ చిలువేరు మొగిళి, రైతుబంధు సమితి జిల్లా బాధ్యుడు చింతిరెడ్డి సాంబరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ గుం డెబోయిన నాగయ్య, వైస్‌ ఎంపీ పీ చింతిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు, రైతులు పాల్గొన్నారు.