గురువారం 22 అక్టోబర్ 2020
Warangal-city - Jun 15, 2020 , 02:05:32

హైదరాబాద్‌ తరలిస్తుండగా కరోనా బాధితుడి మృత్యువాత

హైదరాబాద్‌ తరలిస్తుండగా కరోనా బాధితుడి మృత్యువాత

  •  ముగ్గురిని గాంధీకి తరలించిన వైద్యులు
  • ఆదివారం మరో మూడు పాజిటివ్‌ కేసులు

కరోనాతో వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఆదివారం తొలి మరణం సంభవించడం కలకలం రేపింది. నాలుగు రోజులుగా ఎంజీఎం ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న బాధితుడిని హైదరాబాద్‌కు తరలిస్తుండగా మృత్యువాత పడడం, ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం గాంధీ వైద్యశాలకు పంపించడం, మరో ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆందోళన నెలకొంది.

 వరంగల్‌ చౌరస్తా/రెడ్డికాలనీ/మహదేవపూర్‌ : వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో మొదటి కరోనా మరణం సంభవించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. చనిపోయిన వ్యక్తి కాజీపేట దర్గా ప్రాంత వాసి కావడంతో స్థానికుల్లో కలవరం మొదలైం ది. నాలుగు రోజులుగా ఎంజీఎం ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న నలుగురిని హైదరాబాద్‌ తరలించే క్రమంలో ఒకరు మార్గమధ్యంలోనే చనిపోయినట్లు ఎంజీఎం కొవిడ్‌-19 విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ వీ చంద్రశేఖర్‌ తెలిపా రు. జూన్‌ 10న ఎంజీఎంలో చేరిన వారికి వైరాలజీ పరీక్షల అనంతరం 11న కరోనా పాజిటివ్‌ అని తేల్చారు. వీరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ గాంధీకి తరలిస్తున్న క్ర మంలో స్టేషన్‌ఘన్‌పూర్‌ సమీపంలో కాజీపేటవాసి చనిపో యాడు. మరో ముగ్గురిని హైదరాబాద్‌ తరలించి అతడి మృ తదేహాన్ని తిరిగి వరంగల్‌ తీసుకొచ్చారు. ప్రాథమిక పరీక్షలు చేసి కుటుంబసభ్యుల ఎదుట జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధి కారులకు అప్పగించారు. జమ్మికుంట, శివనగర్‌, జయశంక ర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ ప్రాంతాలకు చెందిన ముగ్గురిని ప్రత్యేక వాహనాల్లో గాంధీకి తీసుకెళ్లారు.  

మరో మూడు పాజిటివ్‌ కేసులు

ఎంజీఎంలో ఆదివారం మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డాక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. హన్మ కొండ విజయనగర్‌ కాలనీకి చెందిన 26ఏళ్ల యువకుడికి, అడ్వకేట్‌ కాలనీకి చెందిన 45 ఏళ్ల మహిళకు, కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన 65 ఏళ్ల వృద్ధురాలికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు చెప్పారు. వారిని ప్రత్యేక గదుల్లో ఉంచి వైద్యసేవలందిస్తున్నామని, ఆ రోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. జిల్లాలో మొత్తం 37 కేసులు నమోదుకాగా ఆదివారం ఒకరు మృతి చెందారు.  

ముందు జాగ్రత్తలు పాటించాలి

కరోనా అంటుకోకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ముం దస్తు జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్‌వో కే లలితాదేవి సూచించారు. హోంక్వారంటైన్‌లో ఉన్నవారు బయటికి రా వొద్దని చెప్పారు. దగ్గు, శ్వాస సమస్యలుంటే వెంటనే ఆరోగ్య సిబ్బందికి గానీ, హెల్ప్‌లైన్‌ నంబర్‌కు గానీ తెలియజేయాల న్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, భౌతిక దూరం పాటించాలని, చేతులు తరచుగా సబ్బుతో లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని, జలుబు, దగ్గు ఉ న్నవారికి దూరంగా ఉండాలని, దగ్గినా తుమ్మినా రుమాలు అడ్డుగా పెట్టుకోవాలని, ముఖ్యంగా పదేళ్లలోపు పిల్లలు, వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు.


logo