మంగళవారం 20 అక్టోబర్ 2020
Warangal-city - Jun 13, 2020 , 01:42:54

ఇంటింటికీ భగీరథ తాగునీరు

ఇంటింటికీ భగీరథ తాగునీరు

n రూ. 65 కోట్లతో గోదావరి జలాలు

n భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి టౌన్‌, జూన్‌ 12: జిల్లాకేంద్రంలో ఇంటింటికీ మిషన్‌ భగీరథ తాగునీరు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని రెడ్డికాలనీలో భగీరథ నల్లా నీటిని ప్రారంభించి మాట్లాడారు. భూపాలపల్లిలో రూ. 65 కోట్లు వెచ్చించి తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. తాను బస్తీబాటకు వచ్చిన సందర్భంగా ప్రజలు తాగునీటి సమస్యను వివరించగా, సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి స్పందించి రూ. 65 కోట్లు మంజూరు చేశారన్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీకి నెలకు రూ. 57 లక్షలను ప్రభుత్వం మంజూరు చేస్తున్నదన్నారు. ఈ నెల 20 నుంచి హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, అందరూ మొక్కలు నాటాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు, కమిషనర్‌ సమ్మయ్య, వార్డు కౌన్సిలర్‌ మాడ కమల, పీఏసీఎస్‌ చైర్మన్‌ మేకల సంపత్‌యాదవ్‌, టీజేఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్‌రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణిని ఎమ్మెల్యే గండ్ర పరామర్శించారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ అర్బన్‌ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, నాయకుడు బుర్ర రమేశ్‌ ఉన్నారు.


logo