మంగళవారం 20 అక్టోబర్ 2020
Warangal-city - Jun 13, 2020 , 01:38:36

షూటింగ్‌ స్పాట్‌లా భద్రకాళీ బండ్‌

షూటింగ్‌ స్పాట్‌లా భద్రకాళీ బండ్‌

n వరంగల్‌ను టూరిజం హబ్‌లా అభివృద్ధి చేస్తాం

n చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌

n శంకుస్థాపన పనులు వెంటనే పూర్తి కావాలి

n ‘కుడా’ చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి

n పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్ల పరిశీలన

వరంగల్‌/ మడికొండ, జూన్‌ 12: ‘వరంగల్‌ నగరానికి రెండు వేల ఏళ్ల చరిత్ర ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సారథ్యంలో నగరాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం’ అని చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. శుక్రవారం ఆయన కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డితో కలిసి భద్రాకాళీ బండ్‌ను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి అద్భుతంగా ఉందని కితాబునిచ్చారు. 17న మంత్రి కేటీఆర్‌ నగర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని, భద్రకాళీ బండ్‌ను ప్రారంభిస్తారని చెప్పారు. మున్ముందు భద్రకాళీ బండ్‌ సినిమా షూటింగ్‌లకు నెలవుగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇక్కడ షూటింగ్‌ కోసం చాలామంది డైరెక్టర్లు ఉత్సాహం చూపుతున్నారన్నారు. రూ. 32 కోట్లతో ఏడు జోన్లుగా విభజించి బండ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు చె ప్పారు. రాంపూర్‌లో రూ. 4కోట్లతో ఏర్పాటు చేయనున్న ఆక్సిజన్‌ పా ర్కుకు, మడికొండలో 100, కాజీపేటలో 100 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేస్తారని, హన్మకొండలోని అంబేద్కర్‌నగర్‌, జితేందర్‌నగర్‌లో పూర్తయిన 590 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభిస్తారని వివరించారు. వారి వెంట కుడా ప్లానింగ్‌ అధికారి అజిత్‌రెడ్డి, ఈఈ భీమ్‌రావ్‌, ఏఈ సిద్ధార్థనాయక్‌ ఉన్నారు.

వెంటనే పూర్తి చేయాలి

రాంపూర్‌లో కుడా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఆక్సిజన్‌ పార్కు శంకుస్థాపన పనులను త్వరగా పూర్తి చేయాలని కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి ఆదేశించారు. పార్కు పనులకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన 34వ డివిజన్‌ కార్పొరేటర్‌ జోరిక రమేశ్‌తో కలసి పరిశీలించారు. వర్షాల నేపథ్యంలో శంకుస్థాపన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఆక్సిజన్‌ పార్కును అత్యంత సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. నగరానికి వచ్చే పర్యాటకులకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక్కడ కుడా డీఈ రాజ్‌కుమార్‌, ఏఈ భరత్‌ ఉన్నారు. logo