శనివారం 31 అక్టోబర్ 2020
Warangal-city - Jun 12, 2020 , 08:31:37

దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ

దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ

  • భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
  • శాయంపేటలో నియంత్రిత సాగుపై సదస్సు

శాయంపేట : దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం శాయంపేటలో నియంత్రిత పంటల సాగుపై సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎరువుల డీలర్లు, రైతులకు సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్రజ్యోతి, ఎమ్మెల్యే రమణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎప్పటికీ పత్తి, మొక్కజొన్న, వరి పంటలే వేయొద్దని పంట మార్పిడి జరగాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రతి ఒక్కరూ ఆవులను పెంచుకోవాలని, ముందుగా తన క్యాంపు ఆఫీసులో త్వరోనే రెండు ఆవులను పెంచబోతున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. శాయంపేటలో మిల్క్‌ కలెక్షన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని గండ్ర హామీ ఇచ్చారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ జ్యోతి మాట్లాడుతూ రైతులకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్‌ రైతు సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జేడీఏ ఉషాదయాల్‌, ఏడీఏ వర్మ, వ్యవసాయ శాస్త్రవేత్త రుక్మిణి, ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, ఆర్‌బీఎస్‌ మండల అధ్యక్షుడు కర్ర ఆదిరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కుసుమ శరత్‌, వైస్‌ చైర్మన్‌ తిరుపతిరెడ్డి, ఏవో గంగాజమున, ఎంపీడీవో సుమనవాణి, తహసీల్దార్‌ హరికృష్ణ, ఎంపీవో రంజిత్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్‌రెడ్డి, దైనంపెల్లి సుమన్‌, పొడిశెట్టి గణేశ్‌,  డీలర్లు సుధీర్‌, శంకరయ్య, రవీందర్‌, శ్రీధర్‌, భాస్కర్‌, మల్లిఖార్జున్‌, ఏఈవోలు రజా, శివ, రాకేశ్‌, శైలజ, ఆర్‌ఐ హేమానాయక్‌, ఎంపీటీసీలు శ్రీనివాస్‌, వేణు, స్వాతి, సర్పంచ్‌లు రవి, రాజిరెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, ప్రసాద్‌, సాంబయ్య తదితరులున్నారు. 

‘అగర్‌ ఉడ్‌ చెట్లు’ కథనాన్ని చదవండి

‘డబ్బు అగర్‌ ఉడ్‌ చెట్లకు కాస్తుంది’  శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో గురువారం ప్రచురి తమైన ప్రత్యేక కథ నాన్ని ఎమ్మెల్యే సదస్సులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. పత్రికను తెప్పించి రైతులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎరువులు, విత్తన డీలర్లు, అధి కారులకు కథనాన్ని చూపిస్తూ లాభాలను వివరించారు. ఈ కథనాన్ని ప్రతి ఒక్కరూ చదువాలని కోరారు. యురోపియన్‌, గల్ఫ్‌ దేశాల్లో అగర్‌ ఉడ్‌చెట్టు నుంచి వచ్చే ఆయి ల్‌ లీటరుకు రూ.5 లక్షలు ఉంటుందని, మన ప్రాంతాల్లో దీనిని పండిస్తే రైతులు లా భపడుతారన్నారు. అగర్‌ ఉడ్‌ అనేది ప్రతి ఇంటిలో ఉండాల్సిన చెట్టని స్పష్టం చేశారు.