బుధవారం 21 అక్టోబర్ 2020
Warangal-city - Jun 11, 2020 , 04:19:14

‘రెడ్‌క్రాస్‌' సేవలు అభినందనీయం : దాస్యం

‘రెడ్‌క్రాస్‌' సేవలు అభినందనీయం : దాస్యం

హన్మకొండ: వరంగల్‌ అర్బన్‌ జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ పాలకవర్గం అందిస్తున్న సేవలు అభినందనీయమని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. సొసైటీ ఆవరణలో బ్లడ్‌బ్యాంకు భవనంపై రెండో అంతస్తు నిర్మాణ పనులను ఆయన ముఖ్య అతిథిగా హాజరై బుధవారం ప్రారంభించారు. కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ సందర్భంగా రక్త సేకరణలో వరంగల్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచిందని దాస్యం ప్రశంసించారు. అనంతరం వినయ్‌భాస్కర్‌ కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, కమిషనర్‌ పమేలా సత్పతితో కలిసి రెడ్‌క్రాస్‌ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, 49వ డివిజన్‌ కార్పొరేటర్‌ కేశబోయిన అరుణ, రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ డాక్టర్‌ పీ విజయచందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ కే సుధాకర్‌రెడ్డి, ట్రెజరర్‌ ఎం నాగయ్య, రాష్ట్ర ఎంసీ మెంబర్‌ ఈవీ శ్రీనివాసరావు, జిల్లా సభ్యులు పొట్లపల్లి శ్రీనివాసరావు, బొమ్మినేని పాపిరెడ్డి, డాక్టర్‌ టీ విజయలక్ష్మి, పెద్ది వెంకటనారాయణగౌడ్‌, చెన్నమనేని జయశ్రీ, బాశెట్టి హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


logo