శనివారం 31 అక్టోబర్ 2020
Warangal-city - Jun 09, 2020 , 04:33:43

ప్రేమ ఒకరితో.. పెళ్లి మరొకరితో..

ప్రేమ ఒకరితో.. పెళ్లి మరొకరితో..

  • ధర్నాకు దిగిన ప్రియురాలు
  • శివనగర్‌లో ఘటన
  • వివరాలు సేకరించిన పోలీసులు

ఖిలావరంగల్‌, జూన్‌ 08 : నాలుగేళ్లుగా ప్రేమించాడు.  నువ్వు లేకుంటే నేను బతకలేనన్నాడు.  చివరికి మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న సదరు యువతి ప్రేమికుడి ఇంటి ఎదు ట ధర్నాకు దిగిన ఘటన సోమవారం శివనగర్‌లో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. సిద్ధిపేటకు చెందిన దీప హన్మకొండలోని ఓ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. నాలుగేళ్ల క్రితం తన స్నేహితుల ద్వారా శివనగర్‌కు చెందిన వీరన్నతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో దీప శివనగర్‌లోని వీరన్న ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండేది. వీరిద్దరి ప్రేమ విషయం వీరన్న ఇంట్లో వాళ్లతో పాటు కాలనీవాసులకు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆమెతో ప్రేమ ను కొనసాగించాలనే నెపంతో ‘నా తల్లిదండ్రులను ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటాను’ అని ఒక లెటర్‌ రాసి ఇచ్చాడు. మరో యువతితో నిశ్చితార్థం జరిగిన ట్లు తెలుసుకున్న దీప ఆదివారం హన్మకొండ పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అక్కడి నుంచి శివనగర్‌కు చేరుకుని వీరన్న ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. విషయం తెలుసుకున్న మిల్స్‌కాలనీ పోలీసులు ఘట న స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం వీరన్నను ఠాణాకు తరలించారు.