శనివారం 31 అక్టోబర్ 2020
Warangal-city - Jun 09, 2020 , 04:28:59

పరీక్ష లేకుండానే పది పాస్‌

పరీక్ష లేకుండానే పది పాస్‌

  • ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం
  • ఊపిరిపీల్చుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
  • ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌
  • త్వరలో విద్యా శాఖ  నుంచి విధివిధానాలు 
  • కొవిడ్‌-19తో తప్పని పరిస్థితుల్లో పరీక్షలు రద్దు..
  • ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 47,843 మంది విద్యార్థులు

‘కరోనా రోజురోజుకూ ఎక్కువవుతున్నది. ఇప్పుడు టెన్త్‌ పరీక్షలు పెడితే ఎలా? ఎలా రాస్తారో.. ఎవరి నుంచైనా వైరస్‌ సోకుతుందా.. హైకోర్టు వాయిదా వేసింది కదా.. ప్రభుత్వం ఏం చేస్తుంది.. మళ్లీ వాయిదా వేస్తే మంచిదా’ అని విద్యార్థుల తల్లిదండ్రులు తర్జనభర్జన పడుతూ ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో పదో తరగతి విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసు కున్నారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 47,843 మంది టెన్త్‌ క్లాస్‌ విద్యార్థులు ప్రమోట్‌ కానున్నారు. ఎస్‌ఏ 1, ఫైనల్‌ ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. మెరిట్‌ ప్రకారం గ్రేడ్‌లను     ప్రకటించనున్నారు. దీని కోసం విద్యాశాఖ నుంచి విధివిధానాలు రావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.

- నమస్తే నెట్‌వర్క్‌

 వరంగల్‌ ఉమ్మడి జిల్లా విద్యార్థులు 

అర్బన్‌ 15,775

జనగామ 7,314

రూరల్‌ 7,695

జయశంకర్‌ భూపాలపల్లి 4,052

ములుగు 3,324

మహబూబాబాద్‌ 9,683  

మొత్తం విద్యార్థులు 47,843 

సుబేదారి/నెహ్రూపార్క్‌/ మహబూబాబాద్‌ రూరల్‌/ పోచమ్మమైదాన్‌, జూన్‌ 08 :  కరోనా వైరస్‌ నేపథ్యంలో పదో తరగతి పరీక్షల విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రు లు ఆందోళన చెందారు. కానీ, సోమవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులందరినీ ప్రమోట్‌ చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించింది. మార్చి, ఏప్రిల్‌లో జరుగాల్సిన టెన్త్‌క్లాస్‌ పబ్లిక్‌ ఎగ్జామ్స్‌ లాక్‌డౌన్‌తో సర్కారు వాయిదా వేసింది. హైకోర్టు అనుమతితో ఈ నెల 8 నుంచి పరీక్షల నిర్వహించాలనుకున్నా కరోనా కేసులు రోజురోజుకూ పెరగడంతో తల్లిదండ్రులు, పిల్లలు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ విద్యా శాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించి తప్పని పరిస్థితుల్లో టెన్త్‌ క్లాస్‌ విద్యార్థులందరినీ ప్రమోట్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నా రు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 47,843 మంది టెన్త్‌ క్లాస్‌ విద్యార్థులు ప్రమో ట్‌ అయ్యారు. ఫలితాలను గ్రేడ్‌ల వారీగా ప్రకటిస్తారు. ఎస్‌ఏ 1, ఫైనల్‌ ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌ చేయడానికి జాబితా సిద్ధం చేయగా 47,843  మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిని ఇంటర్నల్‌ మార్కులను పరిగణనలోకి తీసుకొని అప్‌గ్రేడ్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మెరిట్‌ ప్రకారం గ్రేడింగ్‌ ఏ, గ్రేడింగ్‌ ఏ1, బీ1, బీ2గా ప్రకటించనున్నారు. దీనికోసం విద్యాశాఖ నుంచి విధివిధానాలు రావాల్సి ఉంది. అర్బన్‌ జిల్లాలో ని 15775 మంది విద్యార్థుల ఇంట ర్నల్‌ మార్కులను ఇప్పటికే కంప్యూటరైజేషన్‌ చేశామని డీఈవో నారాయణరెడ్డి తెలిపారు. జనగామ జిల్లాలో 7314, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 7695, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 4052, ములుగు జిల్లాలో 3324, మహబూబాబాద్‌ జిల్లాలో 9683 మంది విద్యార్థులు ప్రమోట్‌ కానున్నారు.

ఊపిరిపీల్చుకున్న తల్లిదండ్రులు..

కొవిడ్‌ 19 నేపథ్యంలో తమ పిల్లలు టెన్త్‌ క్లాస్‌ పరీక్షలు ఎలా రాస్తారో, ఎవరినుంచైనా వైరస్‌ వ్యాపిస్తుంద ననే భయం తల్లిదండ్రుల్లో నెలకొంది. ఈ క్రమంలో రాష్ట్రప్రభుత్వం పరీక్షలను వాయిదా వేసి అందరినీ ప్రమోటెడ్‌ చేయడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు.

పరీక్షల రద్దును ఆహ్వానిస్తున్నాం

ఖిలావరంగల్‌ : పదో తరగతి పరీక్షలు రద్దు చేయడం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తు న్నాం. ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు కొన్ని రోజులుగా తరగతుల నిర్వహణ పేరుతో విద్యార్థులపై ఒత్తి డి పెంచుతున్నాయి.  ఉపాధ్యాయు లు, విద్యార్థులు, తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నది. 

-టీపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెల్లంకొండ రమేశ్‌