సోమవారం 13 జూలై 2020
Warangal-city - Jun 04, 2020 , 02:01:21

వరంగల్‌కు ఆరు బస్తీ దవాఖానలు

వరంగల్‌కు ఆరు బస్తీ దవాఖానలు

  • త్వరలోనే ప్రారంభానికి ఏర్పాట్లు
  • ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌

ఖిలావరంగల్‌, జూన్‌ 03 : వరంగల్‌కు ఆరు బస్తీ దవాఖానలు మంజూరయ్యాయని, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలో వాటిని ప్రారంభిస్తామని వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. బుధవారం పుప్పాలగుట్టలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు మాస్కులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలన్నారు. వరంగల్‌ అర్బన్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ కే లలితాదేవి మాట్లాడుతూ.. కొవిడ్‌-19 నివారణకు  వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రవీందర్‌ మాట్లాడుతూ.. చింతల్‌ ఆరోగ్య కేంద్రం పరిధిలో విదేశాల నుంచి వచ్చిన 42 మంది, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన 63 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచామన్నారు. కార్యక్రమంలో 9, 10, 18 డివిజన్ల కార్పొరేటర్లు సోమిశెట్టి శ్రీలత, కుందారపు రాజేందర్‌, శామంతుల ఉషశ్రీ, ప్రవీణ్‌,  శ్రీనివాస్‌, పీ శ్రీనివాస్‌, డీఐవో డాక్టర్‌ సీహెచ్‌ గీతాలక్ష్మి, డీఎంవో డాక్టర్‌ వాణిశ్రీ, డాక్టర్‌ శ్రీదేవి, డీఈఎంవో వీ అశోక్‌రెడ్డి, పీహెచ్‌వో మోహన్‌రావు, రాజేశ్‌ఖన్నా, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.


logo