గురువారం 02 జూలై 2020
Warangal-city - Jun 03, 2020 , 03:13:36

తెలంగాణ దేశానికే ఆదర్శం

తెలంగాణ దేశానికే ఆదర్శం

  • అభివృద్ధిలో వరంగల్‌ ముందడుగు
  • ఆవిర్భావ వేడుకలో చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌

హన్మకొండ, జూన్‌ 02 : దేశానికే ఆదర్శం తెలంగాణ అని ప్రభుత్వ చీఫ్‌ విప్‌, తెలంగాణ ఆవిర్భావ వేడుకల జిల్లా ఇన్‌చార్జి దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. అదాలత్‌ సెంటర్‌లో అమరవీరులకు నివాళులర్పించి, జూలైవాడ కలెక్టరేట్‌లో జాతీయ జెండా ను ఎగురవేశారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ప్రాణాలకు తెగించి అన్ని వర్గాల ప్రజలను ఉద్యమంలో భాగస్వాములను చేశారన్నారు. అమరుల ఆశయ సాధనకు సీఎం ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారన్నారు. ఆరేళ్ల నుంచి రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తు న్న మహోన్నత వ్యక్తి కేసీఆర్‌ అన్నారు.  కొవిడ్‌-19 కట్టడికి చేపట్టిన చర్యల్లో రెవెన్యూ, పోలీస్‌, మున్సిపాలిటీ, వైద్యశాఖ అధికారులు, సిబ్బంది కృషి అభినందనీయం అన్నారు. కరోనా సమ యంలో ప్రభుత్వం ప్రతి రేషన్‌ కార్డుదారుడితో పాటు వలస కార్మి కులకూ ఉచిత బియ్యంతో పాటు నగదు అందజేసినట్లు తెలిపారు. దీనికి తోడు ప్రజా ప్రతినిధులు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాలు అందజేయడంతో పాటు పేదలనూ ఆదుకున్నాయన్నారు. జిల్లాలోని 17 కంటోన్మెంట్‌ జోన్స్‌లో 28 మొబైల్‌ వాహనాల ద్వారా 58,580 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, మందులు అందజేశామన్నారు. కాళేశ్వరం నీటి విడుదలతో మునుపెన్నడూ లేనివిధంగా అధికవిస్తీర్ణంలో పంటలు సాగయ్యా యన్నారు

. రైతును రాజుగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ ఉచిత విద్యుత్‌, పెట్టుబడి సాయం, రైతుబీమా వంటి పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే రైతును అర్థికంగా అభివృద్ధి చేసేందుకు నియంత్రిత సాగు విధానానికి నాంది పలికారని, అందు కు రైతులు సైతం సన్నద్ధంగా ఉన్నామంటూ పలు గ్రామా ల్లో ప్రతిజ్ఞ చేస్తున్నారని తెలిపారు. ఐటీ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు శుభ్రతకు కేటాయించాలని సూ చించారు. పన్నుల వసూళ్లలో గ్రేటర్‌ వరంగల్‌ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని, ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు రూ.425 కోట్లతో 31 పనులు చేపట్టామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు, మాజీ ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహారి, జెడ్పీ చైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌కుమార్‌, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ బండా ప్రకాశ్‌, ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, ‘కుడా’ చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ రవీందర్‌, అదనపు కలెక్టర్‌ ఎస్‌.దయానంద్‌, గ్రేటర్‌ కమిషనర్‌ పమే లా సత్పతి, మాజీ ఎంపీ సీతారాంనాయక్‌, ఆర్డీవో వెంకారెడ్డి, నాయకులు సుందర్‌రాజ్‌ యాదవ్‌ పాల్గొన్నారు. 


logo