శనివారం 11 జూలై 2020
Warangal-city - May 31, 2020 , 04:01:15

‘తూర్పు’ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తా..

 ‘తూర్పు’ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తా..

  • ఎమ్మె ల్యే నన్నపునేని నరేందర్‌ 

వరంగల్‌/కరీమాబాద్‌: వరంగల్‌ తూర్పు నియోజకవర్గా న్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. శనివారం కార్పొరేషన్‌లో కమిషనర్‌ పమేలా సత్పతితో కలిసి ఇంజినీరింగ్‌ అధి కారుల తో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో రూ.65 కోట్లతో చేపట్టిన 11 స్మార్ట్‌ రోడ్ల పనుల్లో వేగం పెంచి నిర్దేశిత గడువులో గా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నా రు.

స్మార్ట్‌ రోడ్లతో పాటు జంక్షన్లను వినూత్నంగా, సుందరంగా తీర్చిదిద్దాలని అ న్నా రు. ఖిలా వరంగల్‌ను ప్రత్యేక దృ ష్టి పెట్టి అభివృద్ధి చేయాలని అన్నారు. అదేవిధంగా శాంతినగర్‌లోని రాజశ్రీ గార్డెన్‌లో వానకాలం నియంత్రిత పంటల సాగు ప్రణాళికలపై రై తులతో నిర్వహించిన సదస్సులో ఎమ్మెల్యే న రేందర్‌ మాట్లాడారు. రైతును రాజు చేయడ మే కేసీఆర్‌ లక్ష్యమన్నారు. కార్యక్రమాల్లో  రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్‌ ఎల్లావుల లలితాయాదవ్‌, అగ్రికల్చర్‌ జేడీ రవీందర్‌, ఖిలావరంగల్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ కేడల జనార్దన్‌, కార్పొరేటర్లు కేడల పద్మ, మేడిది రజిత, మరుపల్ల భాగ్యలక్ష్మి, కావటి కవిత, దా మోదర్‌యాదవ్‌, సోమిశెట్టి శ్రీలత, యెలుగం లీలావతి, టీఆర్‌ఎస్‌ నాయకులు ముష్కమల్ల సుధాకర్‌, బోరిగం నర్సింగం, బ ల్దియా ఎస్‌ఈ భాస్కర్‌రెడ్డి, పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌ఈ చౌహాన్‌ శ్రీనివాసరావు, కుడా పీవో అజిత్‌రెడ్డి, ఈఈలు విద్యాసాగర్‌, రాజయ్య, శ్రీనివాసరావు, డీఈలు పాల్గొన్నారు.


logo