శనివారం 11 జూలై 2020
Warangal-city - May 31, 2020 , 03:59:37

రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలి

రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలి

  • వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌  

హసన్‌పర్తి/ఐనవోలు: హసన్‌పర్తి మండలంలోని అనంతసాగర్‌ నుంచి గోపాల్‌ పూర్‌ వరకు కుడా నిధులతో నిర్మిస్తున్న రోడ్డు పనులతోపాటు దేవాదుల సౌత్‌ కెనాల్‌ నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని వర్ధన్నపే ట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అధికారులను కోరారు. శనివారం కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, గ్రేటర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ పమేలా సత్పతి, కుడా చైర్మన్‌ మర్రి యాదవ రెడ్డితోపాటు ఎమ్మెల్యే అరూరి అనంతసాగర్‌ నుంచి గోపాల్‌ పూర్‌ వరకు నిర్మిస్తున్న రోడ్డు, దేవాదుల సౌత్‌ కెనాల్‌ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ వానకాలంలోనే పంటలకు సాగునీరు అందేవిధంగా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ, దేవాదుల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

గణేశ్‌కు అభినందనలు

ఐనవోలు మండలంలోని నందనం గ్రామానికి చెందిన యాకర గణేశ్‌ను ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అభినందించారు. గణేశ్‌ తయారు చేసిన ఫ్రీ శానిటైజర్‌, స్మార్ట్‌ అలర్ట్‌ పరికరాల ను ఎమ్మెల్యే పరిశీలించారు. వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లా డీఎంహెచ్‌వోతో మాట్లాడి శానిటైజర్‌ పనితీరును పరిశీలించాల్సిందిగా సూచించారు. గణేశ్‌ను త్వరలోనే మంత్రి కేటీఆర్‌ దగ్గరికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. logo