శనివారం 04 జూలై 2020
Warangal-city - May 30, 2020 , 02:56:48

మిడతలను దీటుగా ఎదుర్కొంటాం..రైతులు అప్రమత్తంగా ఉండాలి

మిడతలను దీటుగా ఎదుర్కొంటాం..రైతులు అప్రమత్తంగా ఉండాలి

  • జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు 
  • బెంగళూరు నుంచి భారీ డ్రోన్‌..!
  • వెయ్యి లీటర్ల క్రిమిసంహారక మందుసిద్ధం  
  • జయశంకర్‌ జిల్లా కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌
  • రామగుండంలో రాష్ట్ర స్థాయి సెంటర్‌ ఏర్పాటుభారీ డ్రోన్‌ తెప్పించే ఏర్పాట్లు
  • భూపాలపల్లి కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌

ములుగు, నమస్తే తెలంగాణ/ భీమదేవరపల్లి : మిడతలను ఎదుర్కొవడానికి జిల్లా అధికార  యంత్రాంగం అప్రమత్తమైందని భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ ఆజీమ్‌  తెలిపారు. శుక్రవారం  సింగరేణి క్లబ్‌ హౌస్‌లో ఆయన మాట్లాడుతూ ఉత్తరభారత దేశంతో పాటు మధ్యప్రదేశ్‌ నుంచి మహారాష్ట్రలోని నాగపూర్‌ ప్రాంతంలో మిడతల కదలికలు ఉన్నట్లు తెలుస్తున్నది. నాగపూర్‌ నుంచి  లక్షలాది మిడతలు  మన రాష్ర్టానికి వచ్చే అవకాశాలున్నట్లు తెలిపారు. అవి వస్తే పంటలకు తీవ్రంగా నష్టం  చేస్తాయన్నారు. ఈ మేరకు పెద్దపెల్లి  జిలా రామగుండంలో రాష్ట్ర  స్థాయి కేంద్రాన్ని చేసి సమీక్షిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ హెచ్చరికల  నేపథ్యంలో జిల్లా ఎస్పీ, జిల్లా అదనపు  కలెక్టర్‌, వ్యవసాయ అధికారి, అగ్ని మాపక శాఖ అధికారి నేతృత్వంలో జిల్లా స్థాయి వ్యవసాయ శాఖ ఏడీ, కాటారం డీఎస్పీ ఆధ్వర్యంలో మండల స్థాయి కమిటీ, సర్పంచ్‌, వీర్వో, పంచాయతీ సెక్రటరీలతో  గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. మిడతలపై రసాయనాలు స్ప్రే  చేయడానికి బెంగుళూరు నుంచి  ప్రత్యేకమైన  భారీ డ్రోన్‌ను తెప్పిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. వెయ్యి లీటర్ల క్రిమిసంహారక మందులను సిద్ధం చేసినట్లు తెలిపారు. 

భీమదేవరపల్లి మండలం ములుకనూరులో అర్బన్‌ జిల్లా వ్యవసాయాధికారి ఉషాదయాళ్‌ మిడితలపై అప్రమత్తంగా ఉండాలనిసూచించారు. మిడతల దాడిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే  పకడ్బందీ ఏర్పాట్లు చేసిందన్నారు. డ్రోన్ల ద్వారా మందులను పిచికారి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరిచారు. ఆమె వెంట ఏడీఏ కేతిరి దామోదర్‌రెడ్డి, వ్యవసాయాధికారి అప్జల్‌ పాషా ఉన్నారు.logo