శుక్రవారం 10 జూలై 2020
Warangal-city - May 30, 2020 , 02:53:12

మై జీడబ్ల్యూఎంసీ పేరుతో సేవలు

మై జీడబ్ల్యూఎంసీ పేరుతో సేవలు

  • ‘గ్రేటర్‌'కు కొత్త యాప్‌
  • ఇంటి, నల్లా పన్నుల చెల్లింపు మరింత సులువు
  • దరఖాస్తులతో పాటు ఫైళ్ల పురోగతిని తెలుసుకునే సదుపాయం
  • జూన్‌ 2 నుంచి అందుబాటులోకి..!
  • తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం  రోజున ఆవిష్కరణ

వరంగల్‌ : కార్పొరేషన్‌ పరిధిలోని ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు బల్దియా సరికొత్త యాప్‌ను రూపొందిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున నగర ప్రజలకు ప్రత్యేక కానుకగా ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ‘సిటిజన్‌ బడ్డీ’తో పాటు గ్రేటర్‌ కార్పొరేషన్‌ సొంతంగా ‘మై జీడబ్ల్యూఎంసీ.కామ్‌' పేరుతో నయా యాప్‌ను రూపొందించింది. సిటిజన్‌ బడ్డీ యాప్‌ కేవలం గ్రీవెన్స్‌ పరిధిలో మాత్రమే సేవలందిస్తున్నది. వరంగల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు మై జీడబ్ల్యూంసీ యాప్‌ను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.

విస్తృత సేవలు..

మై జీడబ్ల్యూఎంసీ.కామ్‌ పేరుతో గ్రేటర్‌ కార్పొరేషన్‌ అధికారులు విస్తృత సేవలు అందించనున్నారు. ఇక నుంచి కార్పొరేషన్‌ అం దించే సేవలను ఇంటి నుంచే పొందవచ్చు. ఇంటి పన్ను, నల్లా పన్ను, ట్రేడ్‌ లైసెన్స్‌ పన్నును ఈ యాప్‌ ద్వారా చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నారు. పింఛన్‌ , ట్రేడ్‌ లైసెన్స్‌ కోసం ఈ యాప్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చ. కార్పొరేషన్‌లో తమ ఫైల్‌ ఏ దశలో ఉంది. ఏ అధికారి వద్ద ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. 


logo