శనివారం 24 అక్టోబర్ 2020
Warangal-city - May 29, 2020 , 01:09:35

గురుకులాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

గురుకులాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

మడికొండ, మే 28 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకుల ప్రతిభా కళాశాల (సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌)ల్లో ఇంటర్మీడియట్‌తో పాటు జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌, ‘నీట్‌' వంటి కాంపిటేటివ్‌ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న సీనియర్‌ ఫ్యాకల్టీకి సహాయకులుగా (సబ్జెక్ట్‌ అసోసియేట్స్‌) ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గురుకులాల జిల్లా కోఆర్డినేటర్‌ కృష్ణమూర్తి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 103 ఖాళీల్లో గణితంలో 22, భౌతికశాస్త్రంలో 18, రసాయనశాస్త్రంలో 22, వృక్షశాస్త్రంలో 22, జీవశాస్త్రంలో 19 ఖాళీల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు వివరాలకు www.tgtwgurukulam. telangana. gov.in లేదా www.tswreis.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించారు. logo