శుక్రవారం 30 అక్టోబర్ 2020
Warangal-city - May 29, 2020 , 01:01:09

నిరాడంబరంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

 నిరాడంబరంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

వరంగల్‌ ప్రతినిధి: కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  సభలు, సమావేశాలు లేకుండా ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అమరవీరులకు నివాళి అర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిం చే కార్యక్రమాలకు మాత్రమే ఈసారి ఆవిర్భావ వేడుకలు పరిమితం కానున్నాయి. అదేవిధంగా జిల్లా కేంద్రం నుంచి గ్రామస్థాయి వరకు ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తారు. జిల్లా ప్రజాపరిషత్‌ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్‌, డీసీసీబీ కా ర్యాలయంపైనా చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, కార్పొరేషన్‌ కార్యాలయ ప్రాంగణంలో మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు ఇ లా మండల ప్రజాపరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపీపీ, గ్రామ పం చాయతీ కార్యాలయం వద్ద సంబంధిత సర్పంచ్‌లు జా తీయ పతాకాల ఆవిష్కరణ ఉండే విధం గా ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.