గురువారం 09 జూలై 2020
Warangal-city - May 25, 2020 , 01:58:14

నవాబ్‌పేటలో వృద్ధ దంపతులకు కరోనా

నవాబ్‌పేటలో వృద్ధ దంపతులకు కరోనా

భూపాలపల్లిటౌన్‌, మే 24 : ముంబై నుంచి వచ్చిన వృద్ధ దంపతులకు కరోనా పాజిటివ్‌ రిపోర్టు రావడంతో వారిని హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించారు. చిట్యాల మండలం నవాబుపేటకు చెందిన వృద్ధ దంపతులు ముంబైలోని తమ కుమారుడి వద్దకు లాక్‌డౌన్‌కు ముం దు వెళ్లి ఈనెల 14న స్వగ్రామానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారు లు వారిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. మొదట భర్తకు పరీక్షలు నిర్వహించగా అతడికి పాజిటివ్‌ వచ్చింది. తర్వాత భార్యకు పరీక్షలు నిర్వహించగా ఆమెకూ పాజిటివ్‌ ఉన్నట్టు శనివారం రిపోర్టు వచ్చింది. ఈ నేపథ్యంలో వారిద్దరినీ గాంధీ దవాఖానకు తరలించారు. దంపతులిద్దరూ గ్రామానికి వచ్చిన తర్వాత ఎవరెవరితో కలిశారు, ఏఏ గ్రామాలకు వెళ్లారనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు.

స్వీయ నియంత్రణ పాటించాలి : డీఎస్పీ

చిట్యాల :  కరోనాపై ప్రజలు ఆందోళ న చెందాల్సిన అసవరం లేదని, ప్రతి ఒక్క రూ స్వీయ నియంత్రణ పాటిస్తే వైరస్‌ను తరిమికొట్టొచ్చని భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు అన్నారు. ఆదివారం ఆయన గ్రామాన్ని సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. కార్యక్రమంలో సీఐ సాయిరమ ణ, సిబ్బంది పాల్గొన్నారు.

కరోనా బాధితులు ‘గాంధీ’కి

వరంగల్‌ చౌరస్తా : వరంగల్‌ ఎంజీఎంలోని కోవిడ్‌ వార్డులో చేరిన నవాబ్‌పేటకు చెందిన ఇద్దరు కరోనా బాధితులను శనివారం హైదరాబాద్‌ గాంధీ దవాఖాకు  తరలించినట్లు కోవిడ్‌ విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. అదేవిధంగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందిన ఆత్మకూరు మండలానికి చెందిన అనుమానితుడి రిపోర్టులు నెగటివ్‌గా వచ్చినట్లు ఆయన చెప్పారు. 


logo