గురువారం 09 జూలై 2020
Warangal-city - May 25, 2020 , 01:53:11

వీడిన గొర్రెకుంట గుట్టు

వీడిన గొర్రెకుంట గుట్టు

  • తొమ్మిది మంది మృతిపై వీడిన మిస్టరీ
  • పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు
  • నిద్ర మాత్రలు ఇచ్చి హత్య చేసినట్లు వెల్లడి
  • అపస్మారక స్థితిలోకి వెళ్లాక బావిలొ పడేసిన వైనం
  • నిందితుడికి సహకరించిన మరో ఇద్దరు 
  • మూడేళ్ల బాలుడి బర్త్‌డే పార్టీ వేదికగా ప్లాన్‌
  • కాల్‌డేటాతో నిందితులను పట్టుకున్న పోలీసులు

వరంగల్‌రూరల్‌, నమస్తేతెలంగాణ: తొమ్మిది మంది మృతి కేసును పోలీసులు ఛేదించారు. గొర్రెకుంటలోని బావి లో చనిపోయిన తొమ్మిది మందివి హత్యలుగానే తమ దర్యాప్తులో గుర్తించారు. నిద్ర మాత్రలు ఇచ్చి హత్య చేసినట్లు నిందితుడు సంజయ్‌కుమార్‌ అంగీకరించాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లాక వారిని బావిలో పడేసినట్లు వెల్లడించాడు. దీంతో తొమ్మిది మంది మృతిపై మిస్టరీ వీడింది. గీసుగొండ మండలం గొర్రెకుంట ఇండస్ట్రియల్‌ ఏరియాలో ఓ గోనె సంచుల గోదాం ఆవరణలోని పాడుబడిన బావిలో గురువా రం నలుగురి మృతదేహాలు, శుక్రవారం ఐదుగురి మృతదేహాలను పోలీసులు కనుగొన్న విషయం తెలిసిందే. మృతుల్లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ఆరుగురు, ఇద్దరు బీహారీలు, ఒకరు త్రిపుర వాసి ఉండటం సంచలనం రేకెత్తించింది. తొలుత బావిలో నలుగురి మృతదేహాలు లభించిన రోజు ఆత్మహత్యలుగా భావించిన పోలీసులు తెల్లవారి మరో ఐదుగురి మృతదేహాలు లభ్యం కావటంతో మొత్తం తొమ్మిది మంది అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు ప్రకటించారు. తొమ్మిది మందిపై అనేక అనుమానాలు ము సురుకోవడంతో మిస్టరీని ఛేదించేందుకు వరంగల్‌ పోలీసు కమిషనర్‌ రవీందర్‌ ప్రత్యేక పోలీసు బృందాలను నియమించారు. మృతదేహాలకు పోస్టుమార్టం జరిగిన తర్వాత హత్యలేనని శనివారం పోలీసులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చా రు. దీంతో ప్రత్యేక పోలీసు బృందాలు హత్యల కోణంలో దర్యాప్తు వేగవంతం చేశాయి. ఈ బృందాల్లోని ఉన్నతాధికారులు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలతో పాటు టాస్క్‌ఫోర్సు, సీసీఎస్‌, సైబర్‌క్రైం, ఐటీకోర్‌ టీం, ఇంటెలిజెన్స్‌, ఫోరెన్సిక్‌ తదితర విభాగాల అధికారులు  సంఘటనా స్థలాన్ని సందర్శించి గోనె సంచుల గోదాం ఆవరణ, పాడుబడిన బావి పరిసరాలను పరిశీలించారు. 

బర్త్‌డే పార్టీ వేదికగా..

ఘటనా స్థలంలో ఆధారాలేవీ లభించకపోవటంతో పోలీసులు ప్రధానంగా మృతుల మొబైల్స్‌ కాల్‌ డేటాపై ఫోకస్‌ పెట్టారు. మరణించిన తొమ్మిది మందిలోని ఎండీ మక్సూద్‌, అతని భార్య నిషా, కూతురు బష్రాఖాతూన్‌, బీహారీలు శ్యామ్‌కుమార్‌, శ్రీరామ్‌కుమార్‌, షకీల్‌ మొబైల్స్‌కు కాల్స్‌ డేటా తీశారు. క్లూ దొరకటంతో శనివారం వరంగల్‌లో ఉంటున్న బీహార్‌కు చెందిన సంజయ్‌కుమార్‌, అతని స్నేహితుడైన అంకూస్‌తో పాటు మక్సూద్‌ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న వరంగల్‌లోని మిద్దెపాక యాకూబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిద్ర మాత్ర లు ఇచ్చి తొమ్మిది మందిని హత్య చేసినట్లు సంజయ్‌కుమార్‌ అంగీకరించాడని తెలిసింది.

వారు అపస్మారక స్థితిలోకి వెళ్లాక గోనె సంచుల్లో తీసుకెళ్లి బావిలో పడేసినట్లు వెల్లడించాడని సమాచారం. బుధవారం రాత్రి గొర్రెకుంటలోని గోనె సంచు ల గోదాంలో మక్సూద్‌ కుటుంబం నివసిస్తున్న గదుల్లో మక్సూద్‌ కూతురు బష్రా ఖాతూరు కొడుకైన మూడేళ్ల బాలు డి బర్త్‌డే పార్టీ జరిగింది. ఈ ఫంక్షన్‌ వేదికగా బీహార్‌ యువకుడు సంజయ్‌కుమార్‌ పక్కా ప్లాన్‌ రూపొందించుకుని అమ ల్లో పెట్టినట్లు తెలిసింది. సంజయ్‌కుమార్‌ యాదవ్‌ బీహార్‌ తన స్నేహితుడైన అంకూస్‌తో పాటు వరంగల్‌లోని మిద్దెపాక యాకూబ్‌ సహాయం తీసుకున్నట్లు సమాచారం. సంజయ్‌కుమార్‌ సహా ఈ ముగ్గురు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. వివాహేతర సంబంధమే ఈ హత్యలకు దారితీసినట్లు సమాచారం. నిందితుడు సంజయ్‌కుమార్‌ను నేడో రేపో పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నట్లు సమాచా రం. ఆదివారం స్టేట్‌ ఇంటెలిజెన్స్‌ బృందం గోనె సంచుల గోదాంను సందర్శించి పరిసరాలను పరిశీలించింది.

మక్సూద్‌ అల్లుడి డైరెక్షన్‌లో.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తొమ్మిది మంది మృతి ఘటనలో సంచలనం నిజం బయటపడింది. తొలి నుంచీ పోలీసులు అనుమానిస్తున్న విధంగానే వారంతా హత్యకు గురయ్యారు. కుట్రపూరితంగానే స్నేహితులతో కలిసి వారందరినీ హత్యచేసి బావిలో పడేసినట్లు ఒప్పుకున్న అతను ఈ మేరకు పోలీసుల విచారణలో హత్యకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించినట్లు సమాచారం. నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక గోనె సంచుల సహాయంతో బావిలో పడేసినట్లు విచారణలో చెప్పిన సంజయ్‌కుమార్‌ ఢిల్లీలో ఉన్న మక్సూద్‌ ఆలం అల్లుడైన ఖతూర్‌ డైరెక్షన్‌లోనే వారందరినీ హత్య చేశానని చెప్ప డం కొసమెరుపు.

ఇక మక్సూద్‌ కుటుంబ సభ్యులతో సంజయ్‌కుమార్‌ వాట్సప్‌ చాటింగ్‌ చేసినట్లు పోలీసుల విచారణ లో తేలింది. తొలుత ఇద్దరు బిహారీలను వదిలేద్దామని భావించిన సంజయ్‌ విషయం బయటకు వస్తే జైలుకు పోవాల్సి వస్తుందని వారిద్దరిని కూడా హత్య చేసినట్లు విచారణలో బయటపడింది. ఘటన జరిగిన మూడు రోజుల్లోనే వరంగల్‌ పోలీసులు కేసును చేధించడం విశేషం.

మృతులెవరంటే...

గొర్రెకుంట శివారులోని సుప్రియ కోల్డ్‌ స్టోరేజీ సమీపంలోని బార్‌దాన్‌ కుట్టే గోదాంలో పనిచేసే మహ్మద్‌ మక్సూద్‌ ఆలం(55), అతడి భార్య నిషా ఆలం(45) కూతురు బుష్రా ఖాతూన్‌(20)తో పాటు ఆమె మూడేళ్ల కుమారుడు గురువారం బావిలో శవాలై తేలారు. అదృశ్యమైన మక్సూద్‌ కుమారులు షాబాజ్‌ ఆలం(19), సోహిల్‌ ఆలం(18)తో పాటు అదే ఖార్ఖానాలో పనిచేసే బిహార్‌ వలస కార్మికులు శ్యాం కుమార్‌షా(21), శ్రీరాం కుమార్‌షా(26) కనిపించకుండా పోవడం, సెల్‌ఫోన్లు స్విచాఫ్‌ ఉండటంతో తొలుత వారిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. శుక్రవారం ఆ నలుగురి మృతదేహాలతో పాటు మక్సూద్‌కు సన్నిహితుడైన మహ్మద్‌ షకీల్‌(30) అనే డ్రైవర్‌ మృతదేహం బావిలో తేలడంతో కథ మరో మలుపు తిరిగింది. ఆ డ్రైవర్‌ పశ్చిమ బెంగాల్‌లోని వెస్ట్‌ సిరిపురకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే అనుమానితుడిగా భావిస్తున్న సంజయ్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్య కోణంలో విచారించారు.  logo