గురువారం 29 అక్టోబర్ 2020
Warangal-city - May 25, 2020 , 01:45:13

ఈద్‌ ముబారక్‌

ఈద్‌ ముబారక్‌

  • ముస్లింలకు మంత్రి ఎర్రబెల్లి రంజాన్‌ శుభాకాంక్షలు 

మహబూబాబాద్‌/ఖిలావరంగల్‌: రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శా ఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్‌ పర్వదినాన్ని కుటుంబ సభ్యులతోనే జరుపుకోవాలని ఆయన ఆ కాంక్షించారు. అదేవిధంగా గిరిజన, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆం గోతు బిందు, కలెక్టర్‌ గౌతమ్‌ ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నందున ముస్లింలంతా ఎవరి ఇంట్లో వారే, కుటుంబ సభ్యులమధ్య పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. 


logo