శనివారం 30 మే 2020
Warangal-city - May 24, 2020 , 03:06:55

కొనుగోళ్లలోనూ నర్సంపేట టాప్‌ : ఎమ్మెల్యే పెద్ది

కొనుగోళ్లలోనూ నర్సంపేట టాప్‌ : ఎమ్మెల్యే పెద్ది

నెక్కొండ/నర్సంపేట: అధిక విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు, అత్యధిక దిగుబడి సాధించడంతోపాటు రైతుల నుంచి పం ట ఉత్పత్తుల కొనుగోళ్లలోనూ నర్సంపేట నియోజకవర్గం రాష్ట్రం లోనే ప్రథమ స్థానంలో నిలిచిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం నెక్కొండలో ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం స్థానిక వ్యవసాయ మార్కె ట్‌ కార్యాల యంలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సొసైటీ చైర్మన్లతో సమీక్షించారు. ఈనెల 31వ తేదీ వరకే కొనుగోళ్లు సాగిస్తామని మార్క్‌ఫెడ్‌ ప్రకటించిందని తె లి పారు. అయితే, నర్సంపేట నియోజకవర్గంలో అత్యధిక దిగుబడి వచ్చిందని, ర వాణాలో ఇబ్బందులు ఉన్నందున మంత్రులు ఈటల రాజేందర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రూరల్‌ కలెక్టర్‌ హరితకు విన్నవించ డంతో జూన్‌ 15 వరకు కొ నుగోళ్లు కొనసాగించేలా అనుమతి లభించిందన్నారు. సమీక్షలో ఓడీసీఎంస్‌ చైర్మన్‌ రామస్వామి, నెక్కొండ, సూరిపల్లి, చెన్నారావుపేట సొసైటీ చైర్మన్లు మారం రా ము, ఘంటా ధర్మారెడ్డి, సత్యనారాయణరెడ్డి, పుండరీకం, చె న్నకేశవరెడ్డి, హరి కిషన్‌ పాల్గొన్నారు. అనంతరం పెద్ది తన సొంత ఖర్చులతో కొనుగోలు చేసిన రంజాన్‌ సామగ్రిని జెడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు అబ్దుల్‌నబీ ఆధ్వర్యంలో ముస్లింలకు పంపిణీ చేశారు. అదేవిధంగా నియోజకవర్గం నుంచి 2500 మెట్రిక్‌ టన్నుల మ క్కలను కోళ్ల పరిశ్రమకు కొనుగోలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్షించారు. 


logo