ఆదివారం 31 మే 2020
Warangal-city - May 23, 2020 , 03:53:52

ప్రైవేటు వర్సిటీగా ఎస్సార్‌

ప్రైవేటు వర్సిటీగా ఎస్సార్‌

 ఈ ఏడాది నుంచే ప్రారంభం

 రాష్ట్రంలో ఐదు ప్రైవేట్‌ వర్సిటీల్లో వరంగల్‌కు ఒకటి..

 విలువలతో కూడిన విద్యే ధ్యేయం

 చైర్మన్‌ ఎనుగందుల వరదారెడ్డి

రెడ్డికాలనీ, మే 22 : విలువలతో కూడిన విద్యను గ్రామీణ, పట్టణ విద్యార్థులకు అందించడమే ధ్యేయంగా 1976 జూన్‌ 22న ఎస్సార్‌ విద్యాసంస్థలు స్థాపించినట్లు చైర్మన్‌ ఎనుగందుల వరదారెడ్డి అన్నారు. హన్మకొండ కాకాజీకాలనీలోని ఎస్సార్‌ జూనియర్‌ కాలేజీలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఐదు ప్రైవేట్‌ యూనివర్సిటీలకు అనుమతి లభించగా అందులో వరంగల్‌లోని శ్రీరాజేశ్వర(ఎస్సార్‌) ఇంజినీరింగ్‌ కాలేజ్‌కు 2020 మే 22న ప్రైవేట్‌ యూనివర్సిటీగా ప్రభుత్వ ఆమోదం లభించిట్లు ఎస్సార్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ చైర్మన్‌ వరదారెడ్డి తెలిపారు. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి యూనివర్సిటీ ప్రారంభించనున్నట్లు చెప్పారు. విద్యానైపుణ్యాల ద్వారా సామాజిక, ప్రాంతీ య అభివృద్ధిలో వేగాన్ని పెంపొందించడమే ఎస్సార్‌ విశ్వవిద్యాలయ ధ్యేయం అన్నారు. వరంగల్‌-కరీంనగర్‌ రహదారిని ఆనుకుని వరంగల్‌ నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో 150 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నెలకొల్పినట్లు ఆయన వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల్లో నెలకొల్పిన 110 విద్యాసంస్థల ద్వారా 90 వేల మంది విద్యార్థులు, 10 వేల మంది బోధన, బోధనేతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెడికల్‌ కళాశాల ఏర్పాటుకూ అనుమతి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఎస్సార్‌ యూనివర్సిటీ విద్యార్థులు విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో ఒక సెమిస్టర్‌ చదివే అవకాశం ఉందన్నారు. అనగా ఒక విద్యార్థి కంప్యూటర్‌ సైన్స్‌ మేజర్‌ తీసుకుని ఈఈఈ మైనర్‌ సబ్జెక్టుగా తీసుకోవచ్చన్నారు. దీంతో సదరు విద్యార్థి బీటెక్‌ సీఎస్‌ఈ మేజర్‌, ఈఈఈ మైనర్‌ డిగ్రీ పొందుతాడని వివరించారు. సమావేశంలో ఎస్సార్‌  డాక్టర్‌ సీవీ గురురావు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వీ మహేశ్‌, అకడమిక్‌ డీన్‌ ఆర్‌అర్చనారెడ్డి పాల్గొన్నారు.

యూనివర్సిటీలోని కోర్సులివే..

సీఎస్‌ఈ, సీఎస్‌ఈ(ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజన్స్‌ అండ్‌ మెషీన్‌ లెర్నింగ్‌), సీఎస్‌ఈ(సైబర్‌ సెక్యురిటీ), సీఎస్‌ఈ(డేటా సైన్స్‌), సీఎస్‌ఈ(బిజినెస్‌ సిస్టమ్స్‌), సీఎస్‌ఈ(ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌), సీఎస్‌ఈ(విజువల్‌ కంప్యూటింగ్‌), సీఎస్‌ఈ (సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌), సీఎస్‌ఈ(కంప్యూటింగ్‌ అండ్‌ సొసైటీ), ఈసీఈ, ఈసీఈ (ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌), ఈసీఈ(ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌) , ఈఈఈ, ఎనర్జీ సిస్టమ్స్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమెషిన్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌(కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌), సివిల్‌ ఇంజినీరింగ్‌ (ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌), టెక్స్‌టైల్‌ ఇంజినీరింగ్‌, ఇంకోవైపు విశ్వవిద్యాలయంలో బీఏ(గ్రాఫిక్‌ డిజైన్‌), బీఏ(విర్చ్యువల్‌ రియాలిటీ అండ్‌ ఇమ్మర్సివ్‌ మీడియా), బీఏ(క్రియేటివ్‌ కమ్యూనికేషన్స్‌), బీఏ(జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూని కేషన్‌), బీఎస్సీ అగ్రికల్చర్‌, బీఎస్సీ హార్టికల్చర్‌, బీఎస్సీ(కాగ్నిటివ్‌ సైన్స్‌), బీఎస్సీ (ఎక్సర్‌సైజ్‌ సైన్స్‌), బీఎస్సీ సైకాలజీ, బీబీఏ(ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌), బీబీఏ(బిజినెస్‌ అనలిటిక్స్‌)తో పాటు మరెన్నో పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌. 

ఎస్సార్‌ సాధించిన విజయాలు..

 •  అన్ని బీటెక్‌ ప్రోగ్రాంలకు ఎన్‌బీఏ ద్వారా టైర్‌-1లో పొందుపర్చారు.
 •  నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) ద్వారా ఏ గ్రేడ్‌.
 •  ఎన్‌ఎస్‌టీఈడీబీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, న్యూఢిల్లీ వారి మద్దతుతో ‘టెక్నాలజీ బిజినెస్‌ ఇంక్యుబేటర్‌' (ఎస్‌ఆర్‌ఐఎక్స్‌) నిర్వహణ. ఇది భారతదేశంలోని టైర్‌-2 నగరాల్లో పెద్దది.
 •  ఎస్‌ఆర్‌ఐఎక్స్‌ పరిధిలో 43 కంపెనీలు వ్యవసాయం, క్లీన్‌టెక్‌, ఐవోటీ, ఏఆర్‌/వీఆర్‌, ఏఐ/ఎంఎల్‌ రంగాల్లో పనిచేస్తున్నాయి
 •  ఎలక్ట్రానిక్స్‌,ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మం త్రిత్వ శాఖ గుర్తింపు పొందిన టైడ్‌ 2.0 సెంటర్‌
 •  ఈయూ-ఇండియా ఇన్నోవేషన్‌ నెట్‌వర్క్‌లో సభ్యత్వం
 •  ఇండో యూనివర్సల్‌ కొలాబరేషన్‌ ఇంజినీరింగ్‌ ఎడ్యుకేషన్‌తో దేశంలో 3వ స్థానం.
 •  2020లో జరిగిన 16వ ప్రపంచ విద్యాసదస్సులో ‘ఎఫెక్టివ్‌ ప్రాక్టీసెస్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌'గా గుర్తింపు
 •  బిజినెస్‌ స్కూల్‌ ఎఫైర్‌, దేవాంగ్‌ మెహతా నేషనల్‌ లీడర్‌షిప్‌ అవార్డు 
 •  2018లో 10 మంది విద్యార్థులకు ‘స్టార్టప్‌ ఇండియా’ అవార్డు అందజేసిన తెలంగాణ ప్రభుత్వం
 •  ఎంహెచ్‌ఆర్డీ ఆధ్వర్యంలో ‘స్మార్ట్‌ ఇండియా ‘హాకథాన్‌-19’ నిర్వహించిన 19 సంస్థల్లో ఒకటి.
 •  అమెరికా, యూకే, ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేస్తున్న సంస్థ. 


logo