మంగళవారం 26 మే 2020
Warangal-city - May 22, 2020 , 02:39:04

‘బార్‌దాన్‌'లో ఏం జరిగింది..?

‘బార్‌దాన్‌'లో ఏం జరిగింది..?

నలుగురి మృతిపై ముసురుకున్న అనుమానాలు

 మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు

మిస్టరీగా మారిన మరో నలుగురి అదృశ్యం

(వరంగల్‌రూరల్‌-నమస్తేతెలంగాణ/ధర్మారం/గీసుగొం డ):  బతుకు దెరువు కోసం 20 ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్‌ నుంచి ఈ ప్రాంతానికి వలస వచ్చిన కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడడంతో గురువారం గొ ర్రెకుంట పారిశ్రామిక ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర విషాదం అలుముకుంది. మరో నలుగురు వ్యక్తుల ఆచూకీ సైతం దొ రకకపోవడంతో మరింత కలకలం రేగుతోంది. వీరి సామూ హిక ఆత్మ హత్యలకు గల స్పష్టమైన కారణాలు సైతం తెలి యకపోవడం స్థానికులను మరింత అయోమయానికి గురి చేస్తోంది. బార్‌దాన్‌ గోడౌన్‌లో అసలేం జరిగింది? గోడౌన్‌లో ఉండే ఓ కుటుంబంలోని ఆరుగురిలో నలుగురు చనిపోతే మరో ఇద్దరు ఏమయ్యారు? వీరితోపాటు గోడౌన్‌లో నివసిస్తున్న ఇంకో ఇద్దరు ఆచూకీ ఎక్కడ? నలుగురి మృతిపై ఆత్మహత్య కోణంలోనే పోలీసులు విచారణ జరుపుతున్నారంటే ఆత్మహత్యకు దారితీసిన కారణాలేమిటి? గొర్రెకుంట ఇండస్ట్రియల్‌ ఏరియాలో జరిగిన దుర్ఘటనపై స్థానికుల మొదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి. 

పశ్చిమ బెంగాల్‌కు చెందిన మక్సుద్‌ కుటుంబం ఉపాధి కోసం చాలా ఏళ్ల క్రితం వరంగల్‌కు వచ్చింది. అతడికి భార్య నిషా, కూతురు బృస్స, ఇద్దరు కొడుకులు, మూడేళ్ల మనవడు ఉన్నారు. కూతురు బృస్స తన భర్తకు దూరంగా తల్లిదండ్రులతో ఇక్కడే ఉంటుంది. ఈ ఆరుగురు చాలాకాలం వరంగల్‌లోని కరీమాబాద్‌లో నివసించారు. ఐదు నెలల క్రితం మ క్సుద్‌, నిషా దంపతులు వరంగల్‌రూరల్‌  జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట ఇండస్ట్రియల్‌ ఏరియాలోని సుప్రియ కోల్డ్‌ స్టోరేజీ సమీపాన ఉన్న ఓ బార్‌దాన్‌ గోడౌన్‌లో పనికి చేరారు. వరంగల్‌ ఏనుమాములలోని సాయిదత్త ట్రేడర్‌ య జమాని సూర్యదేవర సంతోష్‌కుమార్‌ ఈ బారదాన్‌ గోడౌన్‌ నిర్వహిస్తున్నాడు. గతంలో ఈ గోడౌన్‌లో పప్పు మిల్లు పనిచేసింది. ఇందులో ప్రస్తుతం బార్‌దాన్‌ కుట్టే పని జరుగుతుం ది. మార్చి 23 నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి రావటంతో వెళ్లి రావటం ఇబ్బంది అవుతుందని ఇటీవల మక్సుద్‌ తన కు టుంబాన్ని కరీమాబాద్‌ నుంచి గొర్రెకుంట ఇండస్ట్రియల్‌ ఏరియాలో తాము పనిచేసే బార్‌దాన్‌ గోడౌన్‌కు మార్చాడు. గో డోన్‌ ఆవరణలో ఉన్న గదుల్లో మక్సుద్‌, అతడి భార్య నిషా, ఇద్దరు కొడుకులతోపాటు కూతురు బృస్స, ఆమె మూడేళ్ల బా బు ఉంటున్నారు. మక్సుద్‌, నిషా గోడోన్‌లో పనిచేస్తుండగా మక్సుద్‌ ఇద్దరు కొడుకుల్లో ఒకరు ఐటీఐ, మరొకరు పాలిటెక్నిక్‌ వరంగల్‌లో చదువుతున్నారు. ఇదే గోడౌన్‌ ఆవరణలోని ఇతర గదుల్లో బీహార్‌ రాష్ర్టానికి చెందిన శ్యామ్‌, శ్రీరామ్‌ ఉం టున్నారు. వీరిద్దరు ఇదే బార్‌దాన్‌ గోడౌన్‌లో పనిచేస్తున్నా రు. ఇతర కూలీలు ప్రతి రోజు బార్‌దాన్‌ గోడౌన్‌కు ఉదయం వచ్చి పనిముగిశాక సాయంత్రం తమ ఇళ్లకు వెళ్లిపోతారు. బుధవారం సాయంత్రం సహచర కూలీలు వెళ్లిపోయాక మ క్సుద్‌ కుటుంబ సభ్యులు, బీహార్‌ కూలీలు ఇద్దరు ఎవరి గదు ల్లో వారు ఉండిపోయారు.

తెల్లవారే సరికి విగత జీవులుగా..

రోజు మాదిరిగానే యజమాని సంతోష్‌కుమార్‌ గురువా రం గొర్రెకుంట ఇండస్ట్రియల్‌ ఏరియాలోని తన బార్‌దాన్‌ గోడౌన్‌కు వచ్చాడు. గోడౌన్‌లో ఎవరూ కనపడకపోవటంతో అనుమానంతో పరిసరాలన్నీ చూశాడు. గదుల్లో, గోడౌన్‌లో గానీ ఎవరూ కనపడకపోవటంతో గోడౌన్‌ ఆవరణలో ఉన్న బావి వద్దకు వెళ్లాడు. బావిలో మృతదేహాలు కనపడ్డాయి. వెంటనే గీసుగొండ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీం తో సాయంత్రం అడిషనల్‌ డీసీపీ వెంకటలక్ష్మి, మామునూరు ఏసీపీ శ్యామ్‌సుందర్‌, గీసుగొండ ఇన్‌స్పెక్టర్‌ జే శివరామయ్య తమ సిబ్బందితో కలిసి బార్‌దాన్‌ గోడౌన్‌ సందర్శించారు. గోడౌన్‌ ఆవరణలోని బావిలో నాలుగు మృతదేహాలు ఉన్న ట్లు కనుగొన్నారు. సమాచారం అందటంతో పోలీసు క్లూస్‌ టీం, డాగ్‌ స్కాడ్‌ రంగంలోకి దిగాయి. స్థానికుల సహాయం తో పోలీసులు బావిలో నుంచి మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో మక్సుద్‌(55), అతడి భార్య నిషా (48), కూతురు బృస్స (20), బృస్స కుమారుడైన మూడేళ్ల బాబు ఉన్నట్లు ఉ న్నట్లు గుర్తించారు. అనంతరం రాత్రి నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే మక్సుద్‌ నలుగురు కుటుంబ సభ్యులతో ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన కారణాలేమిటి అనేది మాత్రం తెలియలేదని అడిషనల్‌ డీసీపీ వెంకటలక్ష్మి అన్నారు. మక్సుద్‌  కొడుకులు ఇద్దరు, ఇదే గోడౌన్‌లో ఉండే బీహార్‌ కూలీలు ఇద్దరు అదృశ్యమయ్యారని, వారి ఆ చూకీ లభించలేదని ఆమె చెప్పారు. ఈ నలుగురు పారిపోలేదని, వారి వస్తువులు గోడౌన్‌లోనే ఉన్నాయని తెలిపారు.

ముసురుకున్న అనుమానాలు

నలుగురి మృతిపై అనుమానాలు ముసురుకున్నాయి. త మ కుటుంబంలో తల్లిదండ్రులు, సోదరి, మూడేళ్ల బాబు చ నిపోతే మక్సుద్‌ కొడుకులు ఇద్దరు ఎక్కడికి వెళ్లారు? పోలీసులు చెపుతున్నట్లు నలుగురిది ఆత్మహత్య అయితే మక్సుద్‌ కొడుకులు వారిని వదిలేసి వెళ్తారా? అనే ప్రశ్నలు ఉదయించాయి. చనిపోయిన నలుగురిలో మూడేళ్ల బాబు ఉన్నందున నలుగురిది ఆత్మహత్య ఎలా అవుతుందనే చర్చ తెరపైకి వ చ్చింది. ఆత్మహత్యే అయితే మక్సుద్‌ మొదట మిగతా ముగ్గురిని బావిలో తోసేసి తర్వాత అతను బావిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉండాలి అని స్థానికులు భావిస్తున్నారు. ఇదే గాని నిజమైతే మక్సుద్‌ కొడుకులు ఇద్దరు ఆ సమయంలో ఎక్కడికి వెళ్లారు? అప్పటికే వారిద్దరు తమ కుటుంబానికి దూరమయ్యారా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. మక్సుద్‌, నిషా కుమారులు ఎక్కడికి వెళ్లి ఉంటారు? ఏమై ఉంటారు? వారి తోపాటు గోడౌన్‌లో ఉండే బీహార్‌ కూలీలు ఇద్దరు ఏమయ్యా రు? అనేది ఇపుడు మిస్టరీగా మారింది. ఈ నలుగురి అదృశ్యంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అదృశ్యమైన నలుగురు బతికే ఉన్నారా?, ఉంటే ఎక్కడికి వెళ్లి ఉంటారు? అనే కో ణంలో విచారణ జరుపుతున్నారు. ఈ నలుగురు, లేదా వీరి లో ఒకరు దొరికినా? మక్సుద్‌ కుటుంబంలో నలుగురి మృ తికి, బార్‌దాన్‌ గోడౌన్‌లో అసలేమి జరిగింది? అనేది తేలనుంది. అనేక కోణాల్లో పోలీసులు ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నారు. ముఖ్యంగా నలుగురి మృతితో గొర్రెకుంట ఇండస్ట్రియల్‌ ఏరియాలో విషాదం అలుముకుంది.


logo