శనివారం 06 జూన్ 2020
Warangal-city - May 22, 2020 , 02:12:49

కాజీపేట జంక్షన్‌ మీదుగా జూన్‌ 1 నుంచి రైళ్లు ..

కాజీపేట జంక్షన్‌ మీదుగా  జూన్‌ 1 నుంచి రైళ్లు ..

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వా రా టికెట్‌ రిజర్వేషన్‌

కాజీపేట: కాజీపేట రైల్వే జంక్షన్‌ మీదుగా జూన్‌ 1నుంచి పలు రైళ్లను నడుపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. నాల్గో దశ లాక్‌డౌన్‌ మే 31తో ముగియనుండడంతో దేశ వ్యాప్తంగా రైల్వేశాఖ రోజు దాదాపు 200 రైళ్లను నడిపేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. ఇందులో భాగంగా కాజీపేట రైల్వే జంక్షన్‌ మీదుగా పలు రైళ్లు పరుగులు తీయనున్నాయి. 

  • హైదరాబాద్‌- న్యూఢిల్లీ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ 
  • హైదరాబాద్‌- విశాఖపట్నం  (గోదావరి ఎక్స్‌ప్రెస్‌ )
  • సికింద్రాబాద్‌- దానాపూర్‌  (పాట్నా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌)
  • హైదరాబాద్‌- హౌర (ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌)
  • సికింద్రాబాద్‌- గుంటూరు (గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌) 

ఈ రైళ్లకు గురువారం ఉదయం నుంచే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వా రా టికెట్‌ రిజర్వేషన్‌ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ప్రయాణికులు విధిగా మాస్కులు ధరించాలని, ఆరోగ్య సేతు యాప్‌ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. logo