శనివారం 06 జూన్ 2020
Warangal-city - May 15, 2020 , 01:30:02

‘మల్లికాంబ’ సేవలు అభినందనీయం

‘మల్లికాంబ’ సేవలు అభినందనీయం

  • నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

హన్మకొండ, మే 14 : హన్మకొండలోని మల్లికాంబ మనో వికాస కేంద్రంలో మానసిక దివ్యాంగులకు చేస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో మల్లికాంబ మనో వికాస కేంద్రానికి నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే లక్ష్యంతో పనిచేస్తున్న వాళ్ల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతున్నదన్నారు. పిల్లలు, వృద్ధులు, మానసిక, దివ్యాంగులకు సేవ చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. దాతలు ముందుకొచ్చి సంపాదించిన దాంట్లో కొంత పేదలు, దివ్యాంగులకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేంద్రం నిర్వాహకురాలు బండా రామలీల, సదానందరావు, కల్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.  


logo