గురువారం 28 మే 2020
Warangal-city - May 14, 2020 , 02:45:31

ల్యాండ్‌ బ్యాంకుపై ప్రత్యేక దృష్టి

ల్యాండ్‌ బ్యాంకుపై ప్రత్యేక దృష్టి

వరంగల్‌: మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) ఆధ్వర్యంలో ల్యాండ్‌బ్యాంకు ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని ‘కుడా’ చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి అన్నారు. కుడా వైస్‌ చైర్‌పర్సన్‌ పమేలా సత్పతితో కలిసి బుధవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మొదటి విడతలో కనీసం 200 ఎకరాల భూసేకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం త్వరలోనే కుడా పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు. రాంపూర్‌లోని ఆక్సిజన్‌ పార్కులో అభివృద్ధి పనులను వర్షాకాలం ముందే చేపట్టాలని సూచించారు. ఖిలావరంగల్‌లో 10 ఎకరాల భూ మిలో మియావాకి, 20 ఎకరాల్లో బ్లాక్‌ ప్లాంటేషన్‌ చేయాలని అన్నారు. హన్మకొండ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న కమర్షియల్‌ కాంప్లెక్స్‌కు వేలం వేసేందుకు నెలాఖరులోగా ప్రతిపాదనలు చేయాలన్నారు. మ్యూజికల్‌ గార్డెన్‌కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు పునరుద్ధరణ పనులకు వెంటనే టెండర్లు పిలవాలని సూచించారు.logo