గురువారం 04 జూన్ 2020
Warangal-city - May 14, 2020 , 02:45:32

పేదలను ఆదుకోవడానికి ముందుకురావాలి

పేదలను ఆదుకోవడానికి ముందుకురావాలి

  • తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌

వరంగల్‌ చౌరస్తా/మిల్స్‌కాలనీ/కాశీబుగ్గ : పేదలను ఆదుకోవడానికి దాతలు ముందుకురావాలని తూర్పు ఎమ్మెల్యే నన్ననపునేని నరేందర్‌ పిలుపునిచ్చారు. 16వ డివిజన్‌లోని నిజాంపుర వాసులకు టీఆర్‌ఎస్‌ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం సరుకులు పంపిణీ చేశారు. 13వ డివిజన్‌లోని మదర్‌థెరిస్సా అనాథ వృద్ధాశ్రమంలో సింగారపు కల్పన, ప్రభాకర్‌ ఆధ్వర్యంలో వెజ్‌బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. సిలువేరు సాంబయ్య ఆధ్వర్యంలో మూడు క్వింటాళ్ల బియ్యం అందించారు. మాజీ కార్పొరేటర్‌ రోకుల భాస్కర్‌ ఆధ్వర్యంలో యాచకులు, నిరుపేదలకు ఆహారం అందజేశారు. స్వతంత్ర అభివృద్ధి సంఘం ఆధ్వర్యం లో ఫారీద్‌ హుస్సేన్‌ 500 మంది పేద ముస్లింలకు సేమియా కిట్లు పంపిణీ చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు బ్రహ్మచారి కుమారుడు శివకుమార్‌ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆ కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. 


logo