శుక్రవారం 05 జూన్ 2020
Warangal-city - May 12, 2020 , 01:41:29

పేద కుటుంబాలకు సర్కారు అండ

పేద కుటుంబాలకు సర్కారు అండ

  • ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌

మట్టెవాడ, మే 11: పేద కుటుంబాలకు టీఆర్‌ఎస్‌ సర్కారు అండగా ఉంటుందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. వరంగల్‌ 27వ డివిజన్‌ పరిధి రంగంపేటలో కార్పొరేటర్‌ వద్దిరాజు గణేశ్‌ నివాసంలో సోమవారం పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ లాక్‌డౌన్‌ నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాగా, 24వ డివిజన్‌లోని పేదలకు హంటర్‌రోడ్‌లోని పద్మావతి గార్డెన్‌లో నిత్యావసరాలను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో మాజీ ఎంపీ గుండు సుధారాణి, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు రాచర్ల రాము, సురేందర్‌, షఫీ, పరశురాములు, కొడకండ్ల సదాంత్‌ పాల్గొన్నారు.  


logo