శనివారం 06 జూన్ 2020
Warangal-city - May 11, 2020 , 02:27:42

ఘనంగా మాతృదినోత్సవం

ఘనంగా మాతృదినోత్సవం

నయీంనగర్‌/భీమారం : గ్రేటర్‌ వరంగల్‌ 51వ డివిజన్‌ ప్రశాంత్‌నగర్‌లోని సహృదయ అనాథ వృద్ధాశ్రమంలో  సులక్ష్యసేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో సంగీత విభావరి నిర్వహించి,  వృద్ధులకు   శానిటైజర్లను పంపిణీ చేశారు. మాతృమూర్తులను సన్మానించారు. కార్యక్రమంలో సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సంతోశ్‌, వైద్యులు వెంకటరమణ, స్వరూపారాణి, ఆశ్రమ నిర్వాహకులు యాకూబీచోటు, వినయ్‌, కిరణ్‌, వీరభద్రరావు, సతీశ్‌, సుమన పాల్గొన్నారు. అలాగే,  57వ డివిజన్‌ పెగడపల్లి డబ్బాల జంక్షన్‌లో మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాతృమూర్తులను టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి  సన్మానించారు. కార్యక్రమంలో వలస సారంగం, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటస్వామి, రమేశ్‌, మనోహర్‌, శ్రీనివాస్‌, గణేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo