శనివారం 30 మే 2020
Warangal-city - May 11, 2020 , 02:27:44

ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి

  • చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌

నయీంనగర్‌/వరంగల్‌ క్రైం, మే 10 : ప్రతి ఒక్కరూ తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు వడ్డ్డేపల్లిలో గ్రేటర్‌ కమిషనర్‌ పమేలా సత్పతి, సినీ డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌తో కలిసి వినయ్‌భాస్కర్‌ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఇళ్లలో పాడైపోయిన వస్తువులను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన కోరారు. అలాగే, వడ్డేపల్లిలోని పింగిళి డిగ్రీ, పీజీ కళాశాల ఆవరణలో, ప్రశాంత్‌నగర్‌లోని పార్కులో, పోచమ్మకుంటలోని ఫైన్‌ ఫంక్షన్‌ హాల్‌లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే వినయ్‌ పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో కార్పొరేటర్లు మిడిదొడ్డి స్వప్న, దాస్యం విజయ్‌భాస్కర్‌, సరిత, కుడా డైరెక్టర్‌ బొర్ర ఐలయ్య, నాయకులు రవికృష్ణ, వడ్లకొండ వేణుగోపాల్‌, మల్లయ్య, పవన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు రాములు, భరత్‌ తదితరులు పాల్గొన్నారు.


logo