గురువారం 28 మే 2020
Warangal-city - May 11, 2020 , 02:27:44

పరిసరాలను శుభ్రంగా ఉంచాలి

పరిసరాలను శుభ్రంగా ఉంచాలి

  • తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌

ఖిలావరంగల్‌ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ పిలుపునిచ్చారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు యాంటీ లార్వా యాక్టివిటీస్‌ కుటుంబ సమేతంగా నిర్వహిద్దాం అని మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు 19వ డివిజన్‌ శివనగర్‌లోని మైసయ్యనగర్‌లో ఎమ్మెల్యే నరేందర్‌, కమిషనర్‌ పమేలా సత్పతి, కార్పొరేటర్‌ దిడ్డి నాగరాజు పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో గుడిసెవాసులు నిరాదరణకు గురయ్యారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాలనీలకు రోడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించామని చెప్పారు. అలాగే అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ దృష్టికి గుడిసెవాసుల సమస్యలు తీసుకువెళ్లి పట్టాలు ఇచ్చే విధంగా కృషి చేశానని ఆయన తెలిపారు. ఎవరికి వారు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రాష్ట్రం పరిశుభ్రంగా ఉంటుందన్నారు. ఫలితంగా రోగాలు దరికి చేరవన్నారు. ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని, మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు ప్రజలు ప్రతి ఆదివారం 10 నిమిషాలు పరిశుభ్రతకు కేటాయించాలని కోరారు. కమిషనర్‌ పమేలా సత్పతి మాట్లాడుతూ స్లమ్‌ ఏరియా మైసయ్యనగర్‌ చెట్లతో ఆహ్లాకదకరంగా ఉందన్నారు. కాలనీని శుభ్రంగా ఉంచుకుంటున్న ప్రజలను ఆమె అభినందించారు. కార్యక్రమంలో ఎంహెచ్‌వో రాజారెడ్డి, మైసయ్యనగర్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులు గడ్డం రవి, మెరుగు అశోక్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పగడాల సతీశ్‌, అభినాశ్‌, కుమారస్వామి, వేణు, కొత్తపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 


logo