శనివారం 30 మే 2020
Warangal-city - May 11, 2020 , 02:27:45

రోహిణిలో నాట్లు.. దిగుబడికి మెట్లు

రోహిణిలో నాట్లు.. దిగుబడికి మెట్లు

  • పూర్వపు సాగు విధానాలే మేలు
  • సీఎం పిలుపుతో నారు సిద్ధం చేస్తున్న రైతులు
  • సాగు ఆరంభానికి రోహిణి కార్తె భేష్‌

నారుమడి తయారీలో నిమగ్నమైన ఈ దంపతులు నల్లాల శ్యాంసుందర్‌రెడ్డి, సులోచన. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన వీరు పదేళ్లుగా తమకున్న పదెకరాల్లో రోహిణి కార్తెలోనే నాట్లు వేస్తున్నారు. ఎండల్ల నారుపోస్తే ఎక్కడ దక్కుతదని తోటి రైతులు మొదట్లో వీరితో ఎగతాళిగా మాట్లాడేవారు. అయినా పట్టువీడకుండా యేటా రోహిణి కార్తెలోనే వానకాలం నాటు పడేలా ముందుకు సాగుతున్నారు. ప్రతి యేడు వీరి పొ లంలో వస్తున్న దిగుబడులను చూసి మిగతా రైతులు కూడా వీరి బాటలోనే నడుస్తున్నారు. ఈ దంపతులను స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడు ఆ గ్రామంలో 50 మంది వరకు రైతులు రోహిణి కార్తెలో నాట్లు వేసేలా మడులు సిద్ధం చేస్తున్నారు. 

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: రోహిణి కార్తెలో నాట్లు వేయించేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి కరీంనగర్‌ జిల్లా హు జూరాబాద్‌లో పర్యటిస్తానని ఇటీవల సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో రైతుల్లో ఆసక్తి నెలకొంది.  వ్యవసాయ పనులకు రోహిణి కార్తెను ఆరంభంగా వారు పరిగణిస్తారు. మే చివరి వారం, జూన్‌ మొదటి వారంలో వచ్చే కార్తెలో నాట్లు వేసుకుంటే అక్టోబర్‌లోనే పంట కోతకు వ స్తుంది.  సెప్టెంబర్‌లో చీడ పీడల బాధ ఎక్కువ గా ఉంటుంది. అధికంగా వర్షాలు పడి పురుగుల ఉధృ తి పెరుగుతుంది. రోహిణిలో నాట్లు వేసుకుం టే సెప్టెంబరు నాటికి వరిలో గింజ గట్టిపడి పురుగులు దాడి చేసే అవకాశముండదు. రెండో పంట  నవంబర్‌, డిసెంబర్‌లో వేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో మార్చిలోనే యాసంగి కోతలు పూర్తయి రా ళ్ల వాన బాధ తప్పుతుంది. రోహిణి కార్తెలో నాట్ల తో ఎకరానికి 40 నుంచి 50 బస్తాల ధాన్యం దిగు బడి వస్తుందని రైతులు చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీటికి కరువు లేకుండా పోయిం ది. దీంతో ముఖ్యమంత్రి చెప్పినట్లు ముంద స్తుగా నాట్లు వేసుకున్నట్లయితే రైతులకు మేలు జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రోహిణి కార్తె సాగుతో లాభాలు..

  • చీడలను, తెగుళ్లను తట్టుకునే శక్తి  ఎక్కువగా ఉంటుంది
  • రోహిణి కార్తెలో నాట్లు వేస్తే అక్టోబర్‌లో పంట చేతికి వస్తుంది. నవంబర్‌లో యాసంగి పంటగా వరి సాగుచేస్తే మార్చి వరకు కోతలు పూర్తవుతాయి.
  • నవంబర్‌లో పప్పు దినుసులు, కూరగాయలు వేసుకుంటే జనవరి వరకు పంట చేతికి వస్తుంది.
  • ఫిబ్రవరిలో మినుములు, నువ్వులు, బొబ్బెర్ల తో పాటు కూరగాయలు, పుచ్చకాయ పంటలను సాగు చేయొచ్చు. 
  • నీరు లేకుంటే పశుగ్రాసం విత్తనాలు విత్తుకోవచ్చు.

మందన్న కావాలె.. ముందన్న కావాలె..

గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి సంబంధించి అనేక సామెతలున్నాయి. అందులో పంటలో అధిక దిగుబడికి ‘మందన్న కావాలె.. ముందన్న కావాలె’ అనే ది ప్రాచుర్యంలో ఉంది. అంటే ముందస్తుగా పంటలు వేస్తే చీడపీడల బెంగ లేకుండా పంట చేతికొస్తుందని పెద్దల నమ్మకం. అదేవిధంగా ప్రతి పంట సీజన్‌కు రైతులు కార్తెలను బలంగా నమ్ముతారు. కార్తెల ఆధారంగానే పంటల ప్రణాళికను రూపొందించుకుంటారు. ఇందులో భాగంగానే సేద్యంలో అపార అనుభవం ఉన్న సీఎం కేసీఆర్‌ చెప్పి న రోహిణి కార్తెల నాట్లు అంశం ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

వానకాలం, యాసంగి పంటల కాలాన్ని ముందుకు తీసుకురావాలి. కార్తెల ప్రకారం పంటలు సాగు చేయాల్సిన అవసరం ఉంది. ‘రోహిణి’లోనే వడ్లు అలుకాలి. పంటకాలం ముందుకు తీసుకురావాల్సిన అవసరం అనివార్యం. మనం ఇప్పుడు మొగు లు మొఖం చూడాల్సిన పనిలేదు. మనకు అన్నిచోట్లా అస్యూర్డ్‌ వాటర్‌ ఉన్నది. అందుకే చెబుతున్న. సన్న రకాల ధాన్యం పెరుగాలి. వాటికి ఎక్కువ డిమాండ్‌ ఉన్నది. వాటి ద్వారా రైతులకు లాభం జరుగుతుంది. 

చీడపీడలు తక్కువ..

రోహిణిలో నారు పోత్తె చీడపీడలు తక్కువ ఉంటయ్‌. తడి కూడ తక్కువ అవసరం ఉంటది. అందుకే పెద్దలు ముంజే త అలుకాలె అంటరు. ఎరువులు కూడా తక్కువ పడుతయ్‌. పంట దిగుబడి సూత ఎక్కువ అత్తది. రెండో పంట కూడా డిసెంబర్‌లో వేసుకోవచ్చు.

                                                                         - వేశాల సాంబయ్య, రైతు, వేశాలపల్లి; చిట్యాలlogo