మంగళవారం 26 మే 2020
Warangal-city - May 10, 2020 , 02:39:48

మధురం..అమ్మ ప్రేమ

మధురం..అమ్మ ప్రేమ

  • ఆమె గొప్పతనాన్ని మాటల్లో చెప్పలేం
  • నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం

వరంగల్‌ కల్చరల్‌/నిట్‌ క్యాంపస్‌, మే 09: నవమాసాలు మోసి.. చిరునవ్వుతో జన్మనిచ్చి.. గారాబంగా గోరుముద్దలు తినిపించే అమ్మలోని త్యాగ నిరతి, ఆప్యాయత వెలకట్టలేనివి. స్వచ్ఛమైన తల్లిప్రేమను మిం చింది ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. భారతీయ సంస్కృతిలో అగ్ర తాంబూలం మాతృమూర్తికే.. మాతృదేవోభ వ అంటూ తల్లిని పూజించిన తర్వాతే.. తం డ్రిని, గురువును పూజించమంటారు పెద్ద లు. జన్మనిచ్చిన క్షణం నుంచి కంటికి రెప్ప లా అనుక్షణం కాపాడే తల్లిని ప్రతి రోజూ స్మ రించుకోవాల్సిందే. అమ్మ పాత్ర ఎంతటి ఉ త్కృష్టమైనదో ప్రతి సందర్భంలోనూ నిరూపితమవుతూనే ఉన్నది. యాభైరోజులుగా కరోనాతో తల్లడిల్లుతున్న జనాలను తల్లిప్రేమే ఓదార్చింది. లాక్‌డౌన్‌లో అందరూ ఇంటిపట్టునే ఉంటూ.. అమ్మ చాటుకు చేరా రు. వారిని కంటికి రెప్పలా కాపాడుకుం టూ.. వారికి గోరుముద్దలు తినిపిస్తూ.. ఎం తటి కష్టాన్నైనా భరిస్తూ ప్రేమను పంచుతు న్న మాతృమూర్తులకు అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా వందనం. 

మాతృదినోత్సవం ఏర్పడిందిలా..

అమెరికాలో జరిగిన సివిల్‌ వార్‌ గాయాల స్మృతులు చెరిగిపోయేలా చేసేందుకు ‘మద ర్‌ ఫ్రెండ్‌షిప్‌ డే’ నిర్వహించిన అన్నా మేరీ జెర్విన్‌ 1905 మే 9న చని పోయింది. ఆమె కూతురు మిస్‌ జెర్విన్‌ తన తల్లి రెండో వ ర్ధంతిని 1907 మే రెండో ఆదివారం మాతృ దినోత్సవంగా నిర్వహించింది. 1914లో అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్‌ మాతృ దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని నిర్ణయించడంతో ప్రపంచవ్యాప్తంగా మే రెండో ఆదివారాన్ని మాతృ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 

కరోనా కష్టకాలంలో తల్లికి తోడుందాం..

ప్రస్తుత కరోనా సమయంలో పొద్దంతా ఇం ట్లోనే ఉండే వారి కోసం కాస్తయినా తీరిక లే కుండా తల్లి కష్టపడుతోంది. ఇప్పుడైనా ఆ మె తన రోజు వారీ కార్యకలాపాల్లో కాస్త చే దోడు వాదోడుగా ఉందాం. ఆమె చేసే ప్రతి ప నిలో భాగస్వాములమవుదాం. పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో వదిలి చేతులు దులుపుకొంటున్నా రు. పిల్లల్ని పెద్ద చదువులు చదివించి విదేశాలకు పంపితే.. తల్లిదండ్రులు మరణించినా సమయం లేదనే సాకుతో కర్మలను నిర్వహించని సంఘటనలు కోకొల్లలు. ఇలాంటి దినోత్సవాల రోజైనా మానవత్వాన్ని తట్టిలేపుదాం..జన్మనిచ్చిన తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకుందాం.logo