బుధవారం 03 జూన్ 2020
Warangal-city - May 09, 2020 , 02:48:53

త్వరలో ఆరెంజ్‌ జోన్‌లోకి వరంగల్‌ అర్బన్‌

త్వరలో ఆరెంజ్‌ జోన్‌లోకి వరంగల్‌ అర్బన్‌

  • కేంద్రాన్ని కోరిన రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌

హన్మకొండ, నమస్తే తెలంగాణ, మే 08 : వరంగల్‌ అర్బన్‌ జిల్లా ప్రజలకు ఉపశమనం లభించనుంది. రెడ్‌జోన్‌లో ఉన్న జిల్లా త్వరలో ఆరెంజ్‌ జోన్‌లోకి రానుంది. వరంగల్‌ అర్బన్‌, సూర్యాపేట, నిజామాబాద్‌ జిల్లాలను ఆరెంజ్‌ జోన్‌లోకి మార్చాలని   కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌ కోరారు. ఈ విషయాన్ని విలేకరుల సమావేశంలో తెలుపడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత నెల 24 నుంచి జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కాలేదు. దీనికితోడు బాధితులందరూ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కూడా అయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన కొవిడ్‌-19 మార్గదర్శకాల ప్రకారం 14 రోజుల్లో ఒక్క పాజిటివ్‌ కేసు నమోదుకాకపోతే ఆయా జిల్లాలను రెడ్‌ జోన్‌ నుంచి ఆరెంజ్‌ జోన్‌లోకి మార్చాలి. ఈ నేపథ్యంలో నేడో రేపో వరంగల్‌ అర్బన్‌ జిల్లాను కేంద్రం ఆరెంజ్‌ జోన్‌లో చేర్చే అవకాశాలున్నాయి. జిల్లా ఆరెంజ్‌ జోన్‌లోకి వస్తే ప్రజలకు మరిన్ని సడలింపులు రానున్నాయి. కొన్ని షాపులు తెరుచుకోనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. 


logo