బుధవారం 03 జూన్ 2020
Warangal-city - May 09, 2020 , 02:48:56

పేదలకు ఇబ్బందులు రానివ్వం

పేదలకు ఇబ్బందులు రానివ్వం

  • వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌

ఖిలావరంగల్‌/కరీమాబాద్‌, మే 08: లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. శివనగర్‌లోని సాయి కన్వెన్షన్‌ హాల్‌లో పేదలకు పంపిణీ చేయనున్న నిత్యావసర సరుకుల ప్యాకింగ్‌ను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మీ కోసం.. మే సేవకై.. మీ ఎమ్మెల్యే’ అనే కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలోని 25 వేల మందికి త్వరలో నిత్యావసరాలు పంపిణీ చేస్తానని తెలిపారు. తనతోపాటు కొంతమంది దాతలు కలిసి రావడం వల్లనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ నాయకులు శామంతుల శ్రీనివాస్‌, శ్రీరాం రాజేశ్‌ పాల్గొన్నారు. శివనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర యువత అధ్యక్షుడు కోరబోయిన విజయ్‌కుమార్‌ మూడు వేల మాస్కులను ఎమ్మెల్యే నరేందర్‌కు అందజేశారు. అదేవిధంగా టీఆర్‌ఎస్‌ నాయకుడు బత్తిని చంద్రశేఖర్‌ జ్ఞాపకార్థం ఉర్సులో పేదలకు సరుకులు అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మరుపల్ల భాగ్యలక్ష్మి, మేడిది రజిత, బీ వసుంధర, ఎన్‌ కల్పన, మరుపల్ల రవి, బీ అఖిల్‌ పాల్గొన్నారు. 23వ డివిజన్‌లో బత్తుల కుమార్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నరేందర్‌ అన్నదానం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ కత్తెరశాల వేణుగోపాల్‌ పాల్గొన్నారు. 


logo