శుక్రవారం 05 జూన్ 2020
Warangal-city - May 09, 2020 , 02:48:56

సడలింపు సందడి..

సడలింపు సందడి..

  • ఎరువుల దుకాణాల్లో బిజీ బిజీగా రైతులు
  • సిమెంట్‌, ఐరన్‌హార్డ్‌వేర్‌ షాపుల్లో జోరుగా కొనుగోళ్లు
  • ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో యథావిధిగా సేవలు 
  • మళ్లీ భూముల రిజిస్ట్రేషన్లు షురూ
  • లాక్‌డౌన్‌ సడలింపుతో అన్ని వర్గాలకు మేలు 
  • హర్షం వ్యక్తం చేస్తున్న వ్యాపారవర్గాలు 

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌ : కరోనా వైరస్‌ ప్రభావంతో ఇన్నాళ్లు ఆర్థికంగా చితికిపోయిన వివిధ వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపుతో మేలు జరుగుతోంది. ఉమ్మడి వరంగల్‌లోని అర్బన్‌ జిల్లా రెడ్‌జోన్‌లో ఉండగా వరంగల్‌ రూరల్‌, మహబూబాబాద్‌, ములుగు జిల్లా లు గ్రీన్‌ జోన్‌లో, జనగామ, జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలు ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నాయి. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో సడలింపులు ఇవ్వడంతో ప్రభు త్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో యథావిధిగా సేవలందుతున్నాయి. ఎరువులు, విత్తనాల షాపులు తెరుచుకోవడంతో వానకాలం పంటల సాగుకు సంబంధించిన కార్యకలాపాలను అన్నదాతలు చేపట్టారు. మాస్కులు ధరించడంతోపాటు భౌతి క దూరం పాటిస్తున్నారు. సర్కారు నిబంధనలకనుగుణంగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.  కొనసాగుతున్న లాక్‌డౌన్‌తో ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. ఆదాయ వ నరులు సమకూర్చే మద్యం, భూముల రిజిస్ట్రేష న్లు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, భవన ని ర్మాణ రంగం, వ్యవసాయ సంబంధ దుకాణాలు ఇన్నాళ్లు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా దుకాణాలు తెరుచుకోవడంతో ఆయా వర్గాలకు అవసరమైన వస్తువులు లభిస్తున్నాయి. నిర్మాణ రంగాలకు సంబంధించి సి మెంట్‌, ఐ రన్‌ హార్డ్‌వేర్‌, ఎలక్ట్రికల్‌ షాపుల్లో కొనుగోళ్లు ప్రా రంభమయ్యాయి. సడలింపు వల్ల భూముల అ మ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలు ప్రారంభమయ్యాయి. మహబూబాబాద్‌, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, ములుగు పట్టణాల్లోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు సందడిగా మారాయి. ఎరువులు, పురుగు మందుల దుకాణాలు తెరుచుకోవడంతో వీటిలో పనిచేసే సిబ్బందికి ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. మరోవైపు గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో సడలింపుల మూలంగా వివిధ వర్గాల ప్రజలు తమ అవసరాల కోసం దుకా ణాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలకు రావడంతో రహదారులు సందడిగా మారాయి.


logo