మంగళవారం 26 మే 2020
Warangal-city - May 08, 2020 , 06:35:41

కాళేశ్వరం ఒక అద్భుతం..

కాళేశ్వరం ఒక అద్భుతం..

  • రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌
  • అధికారులతో కలిసి కన్నెపల్లి పంప్‌హౌస్‌ సందర్శన

కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమని, అకుంఠిత దీక్షతో సీఎం కేసీఆర్‌ గడువులోగా పనులు పూర్తి చేయించారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. గురువారం ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ఇరిగేషన్‌ సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్సీ మురళీధర్‌తో కలిసి మంత్రి కన్నెపల్లి(లక్ష్మీ) పంప్‌హౌస్‌ను సందర్శించారు. హైదరాబాద్‌నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వారు ఉదయం 9:11గంటలకు కన్నెపల్లికి చేరుకోగా భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌అజీమ్‌, ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌పాటిల్‌ ఘనస్వాగతం పలికారు. 9:50 గంటలకు పంప్‌హౌస్‌కు చేరుకుని ఇంపెల్లర్‌ను పరిశీలించారు. కాళేశ్వరం ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు పంప్‌హౌస్‌ గురించి వారికి వివరించారు. ఆగస్టు నాటికి 3వ టీఎంసీ నీరు ఎత్తిపోసే లా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం 10:19 గంటలకు సరస్వతి పంప్‌హౌస్‌ సందర్శనకు పెద్దపల్లి జిల్లాకు వెళ్లారు.


logo