గురువారం 28 మే 2020
Warangal-city - May 08, 2020 , 06:35:43

రైతుబంధువు కేసీఆర్‌

రైతుబంధువు కేసీఆర్‌

  • అన్నదాత సంక్షేమానికి కృషి
  • మెగా రక్తదాన శిబిరంలో మంత్రి ఎర్రబెల్లి

స్టేషన్‌ఘన్‌ఫూర్‌, నమస్తే తెలంగాణ/ స్టేషన్‌ఘన్‌ఫూర్‌ టౌన్‌, మే 07: ‘లాక్‌డౌన్‌తో రాష్ట్ర ఖజానాకు ఆదాయం తగ్గినా అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ కృషిచేస్తున్నారు. రైతు రుణమాఫీ, రైతుబంధు పథకాలకు నిధులు కేటాయించారు. గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి    అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు స్టేషన్‌ఘన్‌పూర్‌లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో గురువారం తలసేమియాతో బాధపడుతున్న వారి కోసం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అభివృద్ధిలోనే కాకుం డా కరోనా వైరస్‌ కట్టడిలోనూ తెలంగాణ నంబర్‌వన్‌ స్థానంలో ఉందని అన్నారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అప్రమత్తమైన సీఎం కేసీఆర్‌ ఈ నెల 29 వరకు లాక్‌డౌన్‌ అమలుకు ఆదేశాలిచ్చారని అన్నారు. జనగామ జిల్లాలోనే మొదటి సారిగా గన్నీ బ్యాగుల కొరతను పరిష్కరించామన్నారు. తాలు పేరుతో రైతులను మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నందున జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో ఈ సారి భారీగా ధాన్యం దిగుబడులు వచ్చాయన్నారు. నియోజకవర్గ కేంద్రంలో 25 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వ చేసే గోదాం నిర్మాణానికి స్థలసేకరణ పూర్తయిందని, త్వరలోనే రూ. 30 కోట్లతో పనులు చేపడుతామన్నారు. 

ప్రతిపక్షాలవి పసలేని ఆరోపణలు..

ప్రజల ఆరోగ్య సంరక్షణకు సీఎం కేసీఆర్‌ నిరంతరం శ్రమిస్తుంటే ప్రతిప్రక్షాలు పసలేని ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేస్తుంటే విపక్షాలకు కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి కొందరు రైతులు దొంగచాటుగా ఏటూరునాగారం వచ్చి ధాన్యం విక్రయిస్తూ మద్దతు ధర ను పొందుతున్నారన్నారు. త్వరలోనే పాలకుర్తిలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చే యనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

25 వేల మందికి సరుకులు పంపిణీ

  • ఎమ్మెల్యే రాజయ్య

లాక్‌డౌన్‌లో ప్రజలు పస్తులుండొద్దని భావించి స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో సుమారు 25 వేల మందికిపైగా పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని ఎమ్మెల్యే తాటికొండ రా జయ్య వెల్లడించారు. ఈ మెగా రక్తదాన శిబిరంలో దాదాపు 200 మంది రక్తదానం చేశారని పేర్కొం టూ వారిని ఆయన అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే రాజయ్య రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌, జనగామ జెడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏడవెల్లి కృష్ణారెడ్డి, మారపాక రవి, గుండ్రెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, ఆకుల కుమార్‌, సెవెల్లి సంపత్‌, గుడి వంశీధర్‌రెడ్డి, కేసిరెడ్డి మనోజ్‌రెడ్డి, కర్ర సోమిరెడ్డి, తోట వెంకన్న, బాశెట్టి హరిప్రసాద్‌, డాక్టర్‌ ప్రభాకర్‌రావు, టీ సురేశ్‌కుమార్‌, మామిడాల లింగారెడ్డి, పోకల శివన్న, ఉడుముల భాగ్యలక్ష్మి, కందు ల రేఖ గట్టయ్య తదితరులు పాల్గొన్నారు. 


logo