మంగళవారం 26 మే 2020
Warangal-city - May 07, 2020 , 02:22:52

స్వీయనియంత్రణతోనే కరోనా కట్టడి

స్వీయనియంత్రణతోనే కరోనా కట్టడి

  • హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ 

వేలేరు, మే 06 : ప్రజలంతా స్వీయనియంత్రణ పాటిస్తేనే కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ అన్నారు. ప్రభుత్వం కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించిన మండల పరిధిలోని ఎర్రబెల్లి తండాను బుధవారం ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారిని సామాజిక దూరం పాటిస్తూ అరికట్టవచ్చన్నారు. ఆనంతరం తండాలో 165 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే తండాలోని ముల్కనూరు కో-ఆపరేటివ్‌ బ్యాంకును సందర్శించి ధాన్యం కొనుగోళ్లపై ఆరా తీశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ సుధీర్‌కుమార్‌, జెడ్పీటీసీలు చాడ సరిత, వంగ రవి, ఎంపీపీలు సమ్మిరెడ్డి, జక్కుల అనిత, ఎంపీడీవో రవీందర్‌, ఏసీపీ  రవీంద్ర కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo