గురువారం 28 మే 2020
Warangal-city - May 06, 2020 , 01:15:43

కరోనాపై భయాందోళన వద్దు

కరోనాపై భయాందోళన వద్దు

  • వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌

కాశీబుగ్గ, మే 05: కరోనాపై ప్రజలు భయాందోళన చెందొద్దని, సామాజిక దూరం పాటిస్తూ వైరస్‌ను తరిమికొట్టాలని వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ప్ర జలకు పిలుపునిచ్చారు. కాశీబుగ్గ తిలక్‌రోడ్డులోని కేవీఎస్‌ ఫంక్షన్‌ హాల్‌లో కాశీబుగ్గ వర్తక సంఘం ఆధ్వర్యంలో కరోనాపై రూపొందించిన ఆడియో, వీడియో పాటలను మంగళ వారం ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నన్నపునేని మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను విజయవంతం చేస్తూ, కరోనా మహమ్మారిని తరిమికొట్టా లన్నారు. పాటల ద్వారా ప్రజలను చైతన్యం చేస్తున్న వర్తక సంఘాన్ని అభినందించారు. అనంతరం పారిశుధ్య కార్మికులు, ఆశ వర్కర్లు, పోలీసు సిబ్బంది, నిరుపేదలకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు బయ్య స్వామి, గుండేటి నరేంద్రకుమార్‌, గుండేటి కృష్ణమూర్తి, వడిచర్ల సదానందం, మండల శ్రీరాములు, ఓరుగంటి కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. 


logo