సోమవారం 01 జూన్ 2020
Warangal-city - May 03, 2020 , 02:50:30

ఆందోళన వద్దు.. మేమున్నాం

ఆందోళన వద్దు.. మేమున్నాం

  • తెలంగాణ పునర్నిర్మాణంలో మీది ముఖ్యపాత్ర
  • ఇబ్బందులు లేకుండా స్వస్థలాలకు పంపిస్తాం.. 
  • వలస కార్మికులతో ఎమ్మెల్యే నన్నపునేని

ఖిలావరంగల్‌/వరంగల్‌ చౌరస్తా : ‘ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. మీకు మేమున్నాం.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మీ స్వస్థలాలకు పంపించడానికి చర్యలు తీసుకుంటాం’ అని పలు రాష్ర్టాలకు చెందిన వలస కార్మికులకు వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ భరోసా ఇచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణంలో వలస కార్మికుల పాత్ర కూడా కొంత ఉందన్నారు. గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ర్టాలకు చెందిన సుమారు 600 మంది కార్మికులు తమను సొంత ప్రాంతాలకు పంపిస్తున్నారన్న ప్రచారంతో శనివారం వరంగల్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. వారిని స్టేషన్‌లోకి అనుమతించకపోవడంతో ఆందోళన చేపట్టారు. తమను స్వరాష్ర్టానికి తీసుకువెళ్లడంలో బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ విఫలమయ్యారని, ‘ఖానా నక్కో.. హమారేకు గాడీ హోనా.. సీఎం నితీశ్‌కుమార్‌ ముర్దాబాద్‌' అంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అక్కడికి చేరుకొని కార్మికులను వరంగల్‌ బస్టాండ్‌లోకి తీసుకెళ్లి రెండు, మూడు రోజుల్లో స్వస్థలాలకు తరలిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వారికి భోజనం అందించారు. ఎమ్మెల్యేతో పాటు ఖిలావరంగల్‌, వరంగల్‌ తహసీల్దార్లు కిరణ్‌కుమార్‌, ఇక్బాల్‌, ఏసీపీ ప్రతాప్‌కుమార్‌, ఇంతెజార్‌గంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు ఉన్నారు. 

నిత్యావసరాలు పంపిణీ

పోచమ్మమైదాన్‌/కరీమాబాద్‌/కాశీబుగ్గ  : శనివారం 28వ డివిజన్‌ కొత్తవాడలో కార్పొరేటర్‌ యెలుగం లీలావతి ఆధ్వర్యంలో, రాజశ్రీగార్డెన్‌లో టీఆర్‌ఎస్‌ మైనార్టీ విభాగం నాయకుడు మొయిన్‌ ఆధ్వర్యంలో, కాశీబుగ్గలోని తిలక్‌రోడ్డులో కేటీఆర్‌ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఎపి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పేదలకు సరుకులు అందించారు.  logo