ఆదివారం 31 మే 2020
Warangal-city - Apr 30, 2020 , 02:51:40

చెక్‌పోస్టును పరిశీలించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

చెక్‌పోస్టును పరిశీలించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

  • సీఎంఆర్‌ఎఫ్‌కు రూ.50వేల చెక్కు

జనగామ, నమస్తే తెలంగాణ : లాక్‌డౌన్‌లో భాగంగా జనగామ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై పెంబర్తి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ వినోద్‌కుమార్‌, సీఐ మల్లేశ్‌ యాదవ్‌తో కలిసి బుధవారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పరిశీలించారు. వాహనాల రాకపోకలు, అత్యవసరంగా రోడ్డెక్కుతున్న ప్రజల అవసరాలు, అందుబాటులో నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు, మందులు వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. చెక్‌పోస్టు వద్ద నిరంతరం విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను ఎమ్మెల్యే అభినందించారు. కాగా, కరోనా నిర్మూలనకు సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషికి తమవంతుగా తెలంగాణ పవర్‌ డిప్లొమా ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ జనగామ పక్షాన సీఎంఆర్‌ఎఫ్‌ నిధికి బుధవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి రూ.50,001చెక్కును కంపెనీ ప్రధాన కార్యదర్శి నార్ల సుబ్రహ్మణ్యేశ్వర్‌రావు ఆదేశాలతో జనగామ సర్కిల్‌ కార్యదర్శి ఈ కనకయ్య, సర్కిల్‌ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, కోశాధికారి శంకర్‌, డివిజన్‌ కార్యదర్శి రాజ్‌కుమార్‌, ట్రెజరర్‌ నాగరాజు, ఘన్‌పూర్‌ కార్యదర్శి సుజాత అందజేశారు. 


logo