మంగళవారం 26 మే 2020
Warangal-city - Apr 30, 2020 , 02:50:47

కేసీఆర్‌ చర్యలతో వైరస్‌ కట్టడి

కేసీఆర్‌ చర్యలతో వైరస్‌ కట్టడి

  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

తొర్రూరు, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యలతోనే రాష్ట్రంలో కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తొర్రూరు ఎన్‌ఆర్‌ఐ అసోసియేషన్‌, టీఆర్‌ఎస్‌ స్విట్జర్‌ల్యాండ్‌ శాఖ అధ్యక్షుడు శ్రీధర్‌ గందె దాతృత్వంతో తొర్రూరు లయన్స్‌క్లబ్‌, స్వామి వివేకానంద యువజన సంఘం, మైత్రి వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నిర్వహణలో 350 మంది నిరుపేదలు, జర్నలిస్టులకు, మరో ఎన్‌ఆర్‌ఐ పబ్బ మమత-చంద్రశేఖర్‌ దాతృత్వంతో శ్రీవాణి ఎడ్యుకేషనల్‌ సోషల్‌ సర్వీస్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లకు బియ్యం, నిత్యావసర సరుకులు బుధ వారం వేర్వేరుగా పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ఇదే ఒరవడి కొనసాగితే మే 15లోపు కేసుల నమోదు పూర్తిగా తగ్గిపోయే అవకాశముందన్నారు. ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా మిత్రుల సహకారంతో రూ.కోటి50లక్షల మేర సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు. నియోజకవర్గవ్యాప్తంగా రెండు లక్షల మా స్కులను పంచుతామన్నారు. తమిళనాడుకు చెందిన బంగారం వ్యాపారి  సీఎం సహాయ నిధికి రూ.3కోట్లు విరాళంగా ఇచ్చేందుకు తన వద్దకు వచ్చాడన్నారు. అతడిని కేసీఆర్‌, కేటీఆర్‌తో మాట్లాడించి ఆ నిధులను ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పలు దవాఖానల అభివృద్ధి కోసం తెప్పించామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో ఈశ్వరయ్య, డీఎస్పీ వెంకటరమణ, ఎం పీపీ అంజయ్య, జెడ్పీటీసీ శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ హరిప్రసాద్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కన్వీనర్‌ అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రామచంద్రయ్య, వైస్‌ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, కమిషనర్‌ బాబు, లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు లక్ష్మీనర్సింహారావు, డాక్టర్‌ రాజేందర్‌రెడ్డి, సతీశ్‌రెడ్డి, రాజు, స్వామి వివేకానంద యువజన సంఘ ప్రతినిధులు ఏ అనిల్‌కుమార్‌, శ్రీనివాస్‌, గౌరీశంకర్‌, వెంకటరమణ, సోమన్న, శేఖర్‌, మైత్రి వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు విప్లవ్‌రెడ్డి, కృపాల్‌, కృష్ణారెడ్డి, శివ, టీఆర్‌ఎస్‌ మండల, పట్టణ అధ్యక్షులు సీతారాములు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


logo