బుధవారం 03 జూన్ 2020
Warangal-city - Apr 28, 2020 , 02:45:59

కరోనాపై విజయం సాధించాలి: చల్లా

కరోనాపై విజయం సాధించాలి: చల్లా

పరకాల టౌన్‌/దామెర/ఆత్మకూరు: ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి కరోనా మహమ్మారిపై విజయం సాధించాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాయీబ్రాహ్మణులకు సోమవారం బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అలాగే దామెర మండలంలోని ఊరుగొండలో ఆటో కార్మికులకు నిత్యావసరాలను ఎమ్మెల్యే అందజేశారు. అదేవిధంగా ఆత్మకూరు మండలంలోని పెద్దాపురం గ్రా మంలో వలస కూలీలకు రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సోద అనితారామకృష్ణ, వైస్‌ చైర్మన్‌ రేగూరి విజయపాల్‌రెడ్డి, కౌన్సిలర్లు, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు, ఏసీపీ శ్రీనివాస్‌, జెడ్పీటీసీలు కక్కెర్ల రాధికరాజు, కల్పన పాల్గొన్నారు.


logo