బుధవారం 03 జూన్ 2020
Warangal-city - Apr 26, 2020 , 03:00:20

వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

  • డీఎంహెచ్‌వో డాక్టర్‌ లలితాదేవి

రెడ్డికాలనీ/వేలేరు, ఏప్రిల్‌ 25 : జిల్లాలో వైద్యాధికారులు, సిబ్బంది కొవిడ్‌-19 నియంత్రణలో భాగంగా అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ కే లలితాదేవి సూచించారు. పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో చేపట్టాల్సిన చర్యలపై  శనివారం జిల్లా కార్యాలయంలో వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. కంటైన్మెంట్‌ ఏరియాల్లో ఏఎన్‌ఎంలు, ఆశలు వ్యక్తిగత రక్షణ చర్యలు పాటిస్తూ సర్వే చేపట్టాలని సూచించారు. ఎవరికైనా కొవిడ్‌ లక్షణాలు ఉంటే వెంటనే డీఎంహెచ్‌వో లేదా జిల్లా సర్వైలెన్స్‌ అధికారికి తెలియజేయాలన్నారు. సర్వే తీరును వైద్యాధికారులు పర్యవేక్షించాలన్నారు. టెలీ మెడిసిన్‌ నంబర్ల గురించి ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. అలాగే, వేలేరు మండల కేంద్రంలోని పీహెచ్‌సీని సందర్శించి ఆరోగ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎండీ యాకుబ్‌పాషా, డీఐవో డాక్టర్‌ గీతాలక్ష్మి, డీటీసీవో డాక్టర్‌ పీఎస్‌ మల్లికార్జున్‌, జిల్లా సర్వైలెన్స్‌ అధికారి డాక్టర్‌ శ్రీకృష్ణారావు, డబ్ల్యూహెచ్‌వో కన్సల్టెంట్‌ డాక్టర్‌ శ్రావణ్‌రెడ్డి, డీఎంవో డాక్టర్‌ వాణిశ్రీ, పీవోఎన్‌సీడీసీ డాక్టర్‌ ఉమశ్రీ, డీఈఎంవో వేముల అశోక్‌రెడ్డి,  డీఎస్‌వో కృష్ణారావు, పీహెచ్‌సీ వైద్యాధికారి జ్ఞానేశ్వర్‌ పాల్గొన్నారు. 


logo