శుక్రవారం 05 జూన్ 2020
Warangal-city - Apr 25, 2020 , 03:03:37

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌

  • మంత్రి సత్యవతిరాథోడ్‌
  • కురవి మండలం మొగిలిచర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

కురవి : అన్నదాతలు ఆర్థికంగా బలపడితేనే బంగా రు తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందని నమ్మి న రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌ అని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు. కురవి మండలం మొగిలిచర్ల గ్రామంలో ఓడీసీఎంఎస్‌ వరంగల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం జెడ్పీచైర్‌పర్సన్‌ బిందుతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తాను చిన్నతనంలో రాజకీయాల్లోకి వచ్చానని, టీడీపీ హ యాంలో ఎమ్మెల్యేగా గెలిచినా ప్రతిపక్షంలో ఉండి ఈ ప్రాంత ప్రజలకు అనుకున్నంత మేర సేవ చేయలేకపోయానన్నారు. సీఎం కేసీఆర్‌ దయతో మంత్రి పదవిలో ఉన్నానని, నా శక్తి మేరకు నా పుట్టిన ఊ రు గుండ్రాతిమడుగు.., కురవి మండలం.., డోర్నకల్‌ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయిస్తానన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ప్రజలు సామాజిక దూరం తప్పనిసరిగా పా టించాలన్నారు.ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం మహబూబాబాద్‌కు చెందిన డాక్టర్‌ అశోక్‌ చేపట్టిన బైక్‌ చైతన్య యాత్రను అభినందించిన మంత్రి ఆయన రూపొందించిన ప్లకార్డులను ప్రదర్శించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకట్‌రెడ్డి, మాజీ ఓడీసీఎంఎస్‌ చైర్మన్‌ నూకల వేణుగోపాల్‌రెడ్డి, డీసీవో ఇందిర పాల్గొన్నారు. 

రైతులకు ఇబ్బందులు రానివ్వం

మహబూబాబాద్‌, నమస్తే తెలంగాణ : ధాన్యం, మక్కల కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందు లు రానివ్వమని మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపా రు. శుక్రవారం కలెక్టరేట్‌లో ధా న్యం, మక్కల కొనుగోళ్లపై జెడ్పీ చైర్‌పర్సన్‌ బిందు, కలెక్టర్‌ గౌత మ్‌, మహబూబాబాద్‌ ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో కలిసి ఆమె అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లాకు ధాన్యం లోడ్‌తో వెళ్తున్న లారీలు త్వరితగతిన దిగుమతి కాకపోవడంతో సమస్యను పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ దృష్టికి తీసుకెళ్లానన్నారు. లారీల కొరత ఉంటే ధా న్యాన్ని బట్టి ట్రాక్టర్లు, డీసీఎంలను ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పెద్దపల్లికి మాత్రం లారీల ద్వారానే ధాన్యం తరలించాలన్నారు. వడగండ్ల వాన వచ్చే అవకాశమున్నందున త్వరగా కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు. అనంతరం కొనుగోలు కేంద్రాల పనితీరును అదనపు కలెక్టర్‌ మంత్రికి వివరించారు.logo