శుక్రవారం 05 జూన్ 2020
Warangal-city - Apr 23, 2020 , 03:06:05

నేను మీ మంత్రిని.. అంతా బాగేనా!

నేను మీ మంత్రిని.. అంతా బాగేనా!

పెద్దవంగర: ‘నేను ఎవరో తెలుసా..? మీ మంత్రిని.. అంతా బాగేనా..? పనులు ఎట్లా జరుగుతున్నయి.., కాలువ పని చేస్తున్నారా.., మంచి పనే చేస్తున్నరు.., భవిష్యత్‌లో ఉపయోగపడే పనులే చేపట్టండి’ అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆప్యాయంగా ఉపాధి కూలీలతో మమేకమైన తీరిది. మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలంలోని బావోజీ తండా పరిధిలోని కిష్టుతండాలో ఉపాధి కూలీలను చూసి వాహనం ఆపారు. కాలువ గట్టు మీద నడుచుకుంటూ వారి వద్దకు వెళ్లారు. ‘కూలి ఎంత గిడుతుంది..? సరిపోతుందా..? అంటూ వారిని ప్రశ్నించారు. వెంటనే కూలీలు మీరు మా సారే.., మంచిగానే ఉంది సారు.. అని సమాధానం ఇచ్చారు. కరోనా ఉంది తెలుసా.., జరభద్రంగా ఉండండి అని వారికి సూచించారు. 

బాబూ..! బాగున్నావా..! 

ఉపాధి పనులు చేస్తున్న చోటే మంత్రి ఎర్రబెల్లికి ఓ పసివాడు ఎదురు కాగా, రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ, బాబూ.. బాగున్నావా..!, నీ పేరేంటి.. బడికి పోతున్నావా’ అంటూ ఆప్యాయంగా పలుకరించారు. వెంటనే ఆ బాలుడు రెండు చేతులు జోడించి మంత్రికి నమస్కరి స్తూ మాట్లాడడం అక్కడున్నవారందరినీ ఆకర్షింపజేసింది. 


logo