గురువారం 28 మే 2020
Warangal-city - Apr 23, 2020 , 03:05:19

కరోనా నియంత్రణలో రాష్ట్రం ఆదర్శం

కరోనా నియంత్రణలో రాష్ట్రం ఆదర్శం

  • సరిహద్దున ఉన్న సూర్యాపేట జిల్లాతో జాగ్రత్త
  • పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి దయాకర్‌రావు
  • ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ
  • రాయపర్తి, పర్వతగిరిలో పాల్గొన్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌

పెద్దవంగర/రాయపర్తి/దేవరుప్పుల, ఏప్రిల్‌22 : కరోనా వైరస్‌ నియంత్రణలో ప్రపంచ దేశాలకు మన రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని, సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నాయని పంచాయతీ రాజ్‌, గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పెద్దవంగర, రాయపర్తి, పర్వతగిరి, దేవరుప్పుల మండల కేంద్రాల్లో ఎర్రబెల్లి ట్రస్ట్‌, చిదిరాల గీతానవీన్‌ ఆధ్వర్యంలో ఆటోడ్రైవ ర్లు, నిరుపేదలు, హిందూ, ముస్లిం, క్రైస్తవ మత గురువులకు నిత్యావసర సరుకులను బుధవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ  కష్టసుఖా ల్లో ఆదుకునేవాళ్లు దేవుళ్లతో సమానమని అన్నారు. మహ బూబాబాద్‌ జిల్లాలోని పెద్దవంగర మండలానికి సరిహద్దుగా ఉన్న సూర్యాపేటలో కరోనా మహమ్మారి విస్తరిస్తోందని అన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, ఎవరూ ఇండ్లు విడిచి బయటికి రావొద్దని కోరారు. వరంగ ల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరిలో జరిగిన కార్యక్రమం లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలను తప్పక పాటించాలని అన్నారు. అదేవిధంగా పెద్ద వంగర మండలంలోని పోచారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎర్రబెల్లి దయాకర్‌ రావు ప్రారంభించారు. రైతులు ఎవరూ అధైర్య పడొద్దని, ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చే స్తుందని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు వాటిల్లకుండా రైతు బంధు సమితి లదే పూర్తి బాధ్యత అన్నారు. అలాగే కరోనా నేపథ్యంలో తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరు తూ జర్నలిస్టులు ఎర్రబెల్లి, బోయినపల్లి, వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ హరితకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మహబూబాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఆర్డీవో ఈశ్వరయ్య, డీఎస్పీ వెంకటనారాయణ, జెడ్పీటీసీలు జ్యోతిర్మ యి, రంగు కుమార్‌గౌడ్‌, ఎంపీపీ రాజేశ్వరి, పాలకుర్తి దేవస్థాన చైర్మన్‌ రామచంద్రయ్యశర్మ, ఎంపీటీ సీలు, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.

మంత్రికి మాస్కులు అందజేత

 తొర్రూరు, నమస్తే తెలంగాణ: సత్యసాయి ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌కు చెందిన విద్యార్థులు 500 మాస్కులను తయారు చేసి బుధవారం కళాశాల ప్రతినిధి కొత్తూరు రమేశ్‌ చేతుల మీదుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అందజేశారు.logo