శనివారం 30 మే 2020
Warangal-city - Apr 21, 2020 , 02:48:58

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

  • ఎమ్మెల్యే రెడ్యానాయక్‌

నర్సింహులపేట/చిన్నగూడూరు : నియోజకవర్గ చరిత్రలోనే ఎప్పుడూ రానంత పంట దిగుబడి ఈ యాసంగిలో వచ్చిందని, రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని డోర్నకల్‌ ఎమ్మెల్యే ధరంసోత్‌ రెడ్యానాయక్‌ అన్నారు. సోమవారం మండలంలోని కొమ్ములవంచ, జయపురం, కౌసల్యదేవిపల్లి, అక్కిరాల శివారుల్లో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ టేకుల సుశీల, పీఏసీఎస్‌ చైర్మన్‌ సంపెట రాముతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రతిఒక్కరూ సామాజిక దూరం పాటించాలని కోరారు. అలాగే తన స్వగ్రామం ఉగ్గంపల్లిలో చిన్నగూడూరు, మరిపెడ మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు టేకుల యాదగిరెడ్డి, జెడ్పీటీసీ భూక్య సంగీత, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మైదం దేవేందర్‌, వైస్‌ ఎంపీపీ జాటోతు దేవేందర్‌, జిల్లా మైనార్టీ నాయకుడు అయూబ్‌ పాషా, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.


logo