శుక్రవారం 05 జూన్ 2020
Warangal-city - Apr 18, 2020 , 00:44:10

పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయం

పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయం

  • మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి

నక్కలగుట్ట : లాక్‌డౌన్‌ సందర్భంగా పరిశుభ్రత కోసం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయమని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం హన్మకొండ 49వ డివిజన్‌ కనకదుర్గ కాలనీ కమ్యూనిటీ పార్క్‌లో 60 మంది పారిశుధ్య కార్మికులకు కాలనీ వాసుల ఆధ్వర్యంలో ఆయన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌  నిబంధనలను తప్పకుండా పాటించాలని, ప్రతి ఒక్కరూ స్వయం నియంత్రణ చర్యలు పాటించి కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని సూచించారు. ప్రస్తుతం వైద్య, పోలీస్‌, ఇతర యంత్రాంగాలు చేపడుతున్న  చర్యలను ఆయన  అభినందించారు.  


logo