బుధవారం 03 జూన్ 2020
Warangal-city - Apr 18, 2020 , 00:42:40

సామాజిక దూరం పాటించాలి

సామాజిక దూరం పాటించాలి

  • ప్రచార రథం ద్వారా ప్రజలకు  అవగాహన కల్పించిన ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌

మహబూబాబాద్‌, నమస్తే తెలంగాణ : సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత, స్వీయ నియంత్రణ, ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడం వంటి రక్షణ చర్యలు పాటిస్తే కరోనా కట్టడి సులభమేనని ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ యాస పాటలతో ఏర్పాటు చేసిన ప్రచార రథం ద్వారా కరోనా నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ముందు చూపుతోనే రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో సఫలమవుతున్నామన్నారు. ఈ ప్రచా ర రథం నియోజకవర్గంలోని కేసముద్రం, నెల్లికుదురు, గూడూరు, మహబూబాబాద్‌ మండలాల్లో తిరుగుతుందన్నారు.

తూకంలో రైతులను మోసం చేయొద్దు

మహబూబాబాద్‌ రూరల్‌ : రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన పంట ఉత్పత్తుల తూకంలో మోసం చేయొద్దని ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మల్యాల, ముడుపుగల్‌, అమనగల్‌ గ్రామాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్య క్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ రామ్మో హన్‌రెడ్డి, జెడ్పీటీసీ ప్రియాంక, జెడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు మహబూబ్‌పాషా తదితరులు పాల్గొన్నారు.


logo